బాలినేని ఎఫెక్ట్, జగన్ అలర్ట్ - పార్టీలో కీలక మార్పులు, తాజాగా..!!

మాజీ సీఎం జగన్ పార్టీ ప్రక్షాళన పైన ఫోకస్ చేసారు. పార్టీలో కీలక మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో పలువురికి కొత్తగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ప్రకాశం జిల్లా బాధ్యతల స్వీకరణకు బాలినేని నిరాకరించారు. వైసీపీని బాలినేని వీడుతున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో, జగన్ అలర్ట్ అయ్యారు. జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులను ఖరారు చేస్తున్నారు. తాజాగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

జగన్ తాజా నిర్ణయాలు
మాజీ సీఎం జగన్ పార్టీని జిల్లా స్థాయి నుంచి ప్రక్షాళన చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల అధ్యక్షులను మార్పు చేసారు. తాజాగా చిత్తూరు జిల్లా పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాల తరువాత జిల్లాలో పరిస్థితుల పైన ఆరా తీసారు. ఇదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశం పైన నేతల నుంచి అభిప్రాయం సేకరించారు. చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించాలని డిసైడ్ అయ్యారు. తన వయసు, ఇతర బాధ్యతల కారణంగా పెద్దిరెడ్డి తొలుత ఈ బాధ్యతల స్వీకరణకు మొగ్గు చూపలేదు.

YS Jagan Appoints peddireddy as YCP Chittoor dist President

జిల్లాలకు పార్టీ అధ్యక్షులు
జగన్ చిత్తూరు జిల్లాలో తిరిగి పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. దీంతో, పెద్దిరెడ్డి అంగీకరించారు. అదే విధంగా నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు పైన చర్చ జరిగింది. గోవర్ధన్ రెడ్డి తన నియోజకవర్గం సర్వేపల్లికే పరిమితం అవుతున్నారని...జిల్లా గురించి పట్టించుకోవటం లేదని పలువురు నేతలు జగన్ కు వివరించారు. దీంతో, వచ్చ వారం నెల్లూరు జిల్లాలోని అందరు నేతలతో సమావేశం అయి..వారి అభిప్రాయాల మేరకు జిల్లా అధ్యక్ష బాధ్యతలను ఖరారు చేద్దామని జగన్ వారికి స్పష్టం చేసారు.

సీనియర్ల బాధ్యతల మార్పు
ఇక, పార్టీ ఓటమి తరువాత పలువురు నేతలు సజ్జల పైన విమర్శలు చేసారు. ఫలితాల తరువాత సజ్జల ఇప్పటి వరకు జగన్ తో సమావేశాల్లో పాల్గొనటం మినహా.. గతం లో లాగా పార్టీకి సంబంధించిన అంశాల పైన స్పందించటం లేదు. దీంతో..సజ్జలను పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటుగా సాక్షి మీడియా వ్యవహారాలను సైతం చూడాలని నిర్దేశించినట్లు తెలుస్తోంది. తానే పార్టీ నేతలతో నేరుగా టచ్ లో ఉంటానని..మధ్యలో ఎవరూ ఉండరని తనను కలిసిన ముఖ్యులకు జగన్ స్పష్టం చేస్తున్నారు. దసరాలోగా అన్ని జిల్లాలకు అధ్యక్షుల నియామకం పూర్తి చేసి..వరుసగా జిల్లాల పర్యటనలకు జగన్ సిద్దం అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+