హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రిపోర్ట్‌లో కీలక అంశాలు: రాజ్‌నాథ్‌కు వైసీపీ ఫిర్యాదు!, జగన్ వాంగ్మూలంపై కోర్టుకు టీడీపీ

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన దాడి కేసుకు సంబంధించి ఏపీ పోలీసులు నిందితుడు శ్రీనివాస రావును తమ కస్టడీలోకి తీసుకున్నారు. లేఖ రాసిన వారి సమక్షంలో ఆయనను విచారించనున్నారు. లేఖ రాయడానికి సహకరించిన వారి వాంగ్మూలాన్ని సేకరించారు. 11 పేజీల లేఖపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.

<strong>ఆ చివరి పేజీ హడావిడిగా రాశారు, తీగలాగుతున్నాం!: జగన్‌పై దాడి చేసిన వ్యక్తిపై విశాఖ సీపీ</strong>ఆ చివరి పేజీ హడావిడిగా రాశారు, తీగలాగుతున్నాం!: జగన్‌పై దాడి చేసిన వ్యక్తిపై విశాఖ సీపీ

రిమాండ్ రిపోర్టులో పలు అంశాలు

రిమాండ్ రిపోర్టులో పలు అంశాలు

ఇదిలా ఉండగా పోలీసుల రిమాండ్ రిపోర్టులో పలు అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఘటన జరిగిన తీరును స్పష్టంగా రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. జగన్ పైన హత్యాయత్నం జరిగిందని రిపోర్టులో పేర్కొన్నారు. మధ్యాహ్నం గం.12.30 నిమిషాలకు జగన్ విమానాశ్రయం చేరుకున్నారని పేర్కొన్నారు.

రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

ఎనిమిది నిమిషాల పాటు జగన్ ఎయిర్ పోర్టులో ఉన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని తెలుస్తోంది. జగన్‌కు 2 నుంచి మూడు అంగుళాల గాయమైనట్లు పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్టులో ఓ మహిళ పేరును కూడా పొందుపర్చారు. ఎయిర్ పోర్టులో జగన్‌కు కాఫీ సర్వ్ చేసిన మహిళను పేర్కొన్నారని తెలుస్తోంది. శ్రీనివాస రావు తలకు గాయమైనట్లుగా కూడా పేర్కొన్నారని తెలుస్తోంది. శ్రీనివాస రావు 1 పేజీ రాయగా, అతనికి సోదరి వరుసయ్యే యువతి 9 పేజీలు రాయగా, సహచర ఉద్యోగి 1 పేజీ రాశారని పేర్కొన్నారని తెలుస్తోంది. ఈ లేఖపై ప్రత్యేకంగా దర్యాఫ్తు చేస్తున్నారు.

ఢిల్లీకి వైసీపీ నేతల బృందం

ఢిల్లీకి వైసీపీ నేతల బృందం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీకి వెళ్లారు. వారు మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ఆదివారం హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నారు. ఏపీలో శాంతిభద్రతలు అదుపులో లేవని ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. అలాగే జగన్ పైన దాడి ఘటనను థర్డ్ పార్టీతో విచారించాలని కోరనున్నారు. మంగళవారం రాష్ట్రపతితో భేటీ కానున్నారు. ఈ మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండి చంద్రబాబు ప్రభుత్వంపై ఫిర్యాదు చేయనున్నారు. అలాగే రాష్ట్రంలోని పరిస్థితులను చెప్పనున్నారు.

జగన్ వాంగ్మూలంపై కోర్టుకు

జగన్ వాంగ్మూలంపై కోర్టుకు

జగన్ పైన దాడి ఘటనపై పితాని సత్యనారాయణ స్పందిస్తూ.. విచారణకు అందరూ సహకరించాలని జగన్‌కు విజ్ఞప్తి చేశారు. పోలీసులకు స్టేట్‌మెంట్ ఇవ్వకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం విఫలమైందని చెప్పడం సరికాదన్నారు. జగన్ పైన హత్యాయత్నం ఘటనపై విచారణ జరుగుతోందన్నారు. జగన్ వాంగ్మూలంపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదన్నారు.

Recommended Video

Special Report On Ys Jagan's Issue : దిక్కుమాలిన ఆలోచనలు మానుకో చంద్రబాబు ! | Oneindia Telugu

English summary
YSR Congress Party chief YS Jagan Mohan Reddy attacker Srinivas Rao in Police custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X