వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారాయణ, చైతన్యకు జగన్ భారీ షాక్- టెన్త్ ర్యాంకుల ప్రకటనలకు బ్రేక్- ఏడేళ్ల జైలు శిక్ష

|
Google Oneindia TeluguNews

ఏపీలో గత రెండు దశాబ్దాల్లో టీవీ పెడితే చాలు ర్యాంకుల ప్రకటనలతో జనం విసిగిపోయే పరిస్ధితి. ఒకటి,రెండు, నాలుగు, ఆరు.. వందలోపు 200 ర్యాంకులంటూ మోసపూరిత ప్రకటనలు చేస్తూ విద్యార్ధుల తల్లితండ్రుల్ని ఏమార్చే ప్రకటనలకు లెక్కేలేకుండా పోయింది. ముఖ్యంగా నారాయణ, శ్రీ చైతన్య వంటి ప్రధాన విద్యాసంస్ధలు ఏటా పదో తరగతి పరీక్షల ఫలితాల ప్రకటన సందర్భంగా ఇచ్చే యాడ్స్ సంగతి చెప్పనక్కర్లేదు. దీంతో ప్రభుత్వం వీటికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

 టెన్త్ ర్యాంకుల ప్రకటన

టెన్త్ ర్యాంకుల ప్రకటన

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సీజన్ వస్తుందంటే చాలు విద్యార్ధులు, వారి తల్లితండ్రులే కాదు సాధారణంగా టీవీ చూసే ప్రేక్షకులకూ ఓ భయం వెంటాడుతుంటుంది. ముఖ్యంగా పరీక్షా ఫలితాల్ని ప్రభుత్వం ప్రకటించగానే టీవీ పెట్టాలంటే భయం. పదో తరగతి నుంచి మొదలుపెట్టి ఇంటర్, ఎంసెట్, ఇలా ప్రతీ పరీక్షకూ సంబంధించిన ర్యాంకుల ప్రకటన టీవీల్లో చూడాలంటే ఒళ్లు జలదరిస్తుంది. టీవీ పెడితే చాలు ఒకటి, రెండు, నాలుగు.. ఇలా అన్ని ర్యాంకులు మావే అంటూ విద్యాసంస్ధలు చేస్తున్న మోసపూరిత ప్రకటనలు దర్శనమిస్తుంటాయి.

నారాయణ,చైతన్య ర్యాంకులు

నారాయణ,చైతన్య ర్యాంకులు

తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్ధలైతే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. ర్యాంకుల ప్రకటనలో ఈ రెండు సంస్ధలు ఇచ్చే యాడ్లు చూస్తే దేశంలో అన్ని ర్యాంకులు ఈ రెండు విద్యాసంస్ధలకే ఎలా వస్తాయన్నది ఎవరికీ అర్ధం కాదు. ముఖ్యంగా పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో అన్ని ర్యాంకులు తమకే అన్నట్లుగా ఆయా సంస్ధలు చేస్తున్న ప్రచారం తమ ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసమే అన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మోసపూరిత ప్రకటనలకు బ్రేక్ వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ర్యాంకుల ప్రకటనపై నిషేధం

ర్యాంకుల ప్రకటనపై నిషేధం

ఏపీలో పదో తరగతి పరీక్షల్లో ర్యాంకుల ప్రకటనల్ని నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల్లో విద్యార్ధులకు ర్యాంకులు వచ్చినట్లు ఏ విధంగానూ ప్రచారం చేయరాదని ప్రభుత్వం నిన్న ఆయా విద్యాసంస్ధలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇకపై ర్యాంకుల్ని ప్రకటించేందుకు నారాయణ, చైతన్యతో పాటు ఇతర విద్యాసంస్ధలకు వీల్లేకుండా పోయింది. ప్రభుత్వ ఆదేశాల్ని ఉల్లంఘించి ర్యాంకులు ప్రకటిస్తే ఆయా సంస్ధలపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు.

నిషేధానికి కారణాలివే

నిషేధానికి కారణాలివే

పదో తరగతి పరీక్షల ర్యాంకుల్నివిద్యాసంస్ధలు ప్రకటనల రూపంలో వెల్లడించకుండా ప్రభుత్వం నిషేధం విధించడం వెనుక కీలక కారణాలున్నాయి. ఇందులో ముఖ్యంగా ఈ ర్యాంకుల పేరుతో జరుగుతున్న ప్రచారం విద్యార్ధుల తల్లితండ్రుల్ని మభ్యపెట్టేలా ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు తల్లితండ్రుల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ర్యాంకులు ప్రకటిస్తే గరిష్టంగా ఏడేళ్ల శిక్ష

ర్యాంకులు ప్రకటిస్తే గరిష్టంగా ఏడేళ్ల శిక్ష

ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఉల్లంఘించి పదో తరగతి ర్యాంకులు ప్రకటించినా, టీవీల్లో ప్రకటనలు చేసినా ఇందుకు బాధ్యులైన వారికి కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఏడేళ్ల వరకూ శిక్షలు విధించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే లక్ష రూపాయల వరకూ జరిమానా విధించే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఇకపై ర్యాంకుల ప్రకటనలకు బ్రేక్ పడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో టీవీ ప్రేక్షకులకు కూడా కాస్త ఊరట దక్కబోతోంది.

English summary
ap govt has banned ssc ranks annoucement advertisements to stop cheating students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X