YS Jagan biopicపై లేటెస్ట్ అప్‌డేట్: లీడ్ రోల్‌లో వారిద్దరూ కాదు: తెరపై కొత్త నటుడు: స్కామ్..ఫేమ్

అమరావతి: వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైెఎస్ జగన్మోహన్ రెడ్డి పదేళ్ల రాజకీయ జీవితంపై తెరకెక్కడానికి సిద్ధంగా ఉన్న మూవీపై తాజా అప్‌డేట్ వెలువడింది. యాత్ర సినిమాతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాగించిన ప్రజాప్రస్థానం పాదయాత్రను కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన దర్శకుడు మహీ వీ రాఘవ్ ఈ మూవీని త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. వైఎస్ జగన్ బయోపిక్ (YS Jagan biopic)లో నటించడానికి అవసరమైన నటీనటుల ఎంపిక దాదాపు ఫైనలైజ్ అయినట్టే. వైఎస్ జగన్ క్యారెక్టర్‌లో కొత్త నటుడు కనిపించబోతోన్నాడనేది ఫిల్మ్‌నగర్ టాక్.

ఎందుకీ బయోపిక్..

ఎందుకీ బయోపిక్..

దేశ రాజకీయాల్లో 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న చంద్రబాబు సారథ్యాన్ని వహిస్తోన్న తెలుగుదేశం, వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీకి ఎదురు నిలిచి.. పార్టీని నెలకొల్పిన 10 సంవత్సరాల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన యువనేతగా వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు.

రాష్ట్ర విభజనానంతరం 2014లో ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో పరాజయాన్ని చవి చూసినప్పటికీ- దాన్ని విజయనాకి తొలి మెట్టుగా స్వీకరించిన వైఎస్ జగన్ ఆ తరువాతి ఎన్నికల్లో ఎలాంటి విక్టరీని సాధించారనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేని విషయం. దేశ రాజకీయాల్లో నాలుగో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది.. ఆయన సారథ్యంలోని వైఎస్సార్సీపీ.

ఏఏ అంశాలు తెరకెక్కబోతోన్నాయి..

ఏఏ అంశాలు తెరకెక్కబోతోన్నాయి..

వైఎస్సార్ ప్రజా ప్రస్థానాన్ని తెరకెక్కించి.. ఆయన ప్రమాణ స్వీకారం, అనంతరం హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలతో యాత్ర మూవీని ముగించిన దర్శకుడు మహీ వీ రాఘవ్.. ఈ సారి కూడా అలాంటి అంశాన్నే కథగా మలచుకున్నారు. వైఎస్సార్ మరణం తరువాత..ఆయన స్థానంలో వైఎస్ జగన్ ఎలా ఎదిగారనేది ఈ చిత్రం మూల కథగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం- వైసీపీ నెలకొల్పడం, ఆ తరువాత 2014 నాటి ఎన్నికలు, వైఎస్ జగన్ 3547 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర.. 2019 నాటి ఎన్నికలు.. అందులో వైసీసీ సాధించిన ఘన విజయాన్ని చిత్రీకరించనున్నారు దర్శకుడు.

అల్లు అర్జున్.. అక్కినేని నాగార్జున పేర్లు..

అల్లు అర్జున్.. అక్కినేని నాగార్జున పేర్లు..

ఇదివరకు వైఎస్ జగన్ బయోపిక్‌ లీడ్ క్యారెక్టర్‌లో అల్లు అర్జున్ నటిస్తారనే వార్తలు వెలువడ్డాయి. ఆ పేరు తెర వెనక్కి వెళ్లింది. అతని స్థానంలో అక్కినేని నాగార్జున పేరు కూడా కొద్దిరోజులు పాటు చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం ఈ పేరు కూడా వినిపించట్లేదు. వైఎస్ జగన్ పాత్రధారి ఎవరనే విషయంపై ఎలాంటి అప్‌డేట్స్ కూడా రాలేదు. ఆ తరువాత కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విజృంభణతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్, నటీనటుల ఎంపికకు కొద్దిగా బ్రేక్ పడింది.

కొత్త నటుడు..

కొత్త నటుడు..

ఈ బ్రేక్ సమయంలో- మహీ వీ రాఘవ్.. నటీనటుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కీలకమైన లీడ్ రోల్‌లో బాలీవుడ్ యంగ్ హీరోను సెలెక్ట్ చేసినట్లు సమాచారం. అతనెవరో కాదు- ప్రతీక్ గాంధీ (Pratik Gandhi). స్కామ్ 1992 ఫేమ్. ఈ 1992లో స్టాక్ మార్కెట్‌ను కుదిపి పారేసిన హర్షద్ మెహతా కుంభకోణాన్ని కథాంశం తీసుకుని చిత్రీకరించిన వెబ్ సిరీస్ ఇది. ఈ మూవీలో నటించాడు ప్రతీక్ గాంధీ. సూపర్ హిట్‌గా పేరు తెచ్చుకున్న ఈ సిరీస్‌తో మహీ వీ రాఘవ్ కంట్లో పడ్డాడు ప్రతీక్ గాంధీ. వైఎస్ జగన్ క్యారెక్టర్ టైలర్ మేడ్ అవుతుందనే ఉద్దేశంతో అతన్ని సంప్రదించగా.. ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రతీక్ గాంధీ ఎందుకు?..

ప్రతీక్ గాంధీ ఎందుకు?..

దేశ రాజకీయాల్లో నాలుగో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన వైసీపీ.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ జీవిత చరిత్రతో ముడిపడి ఉన్న మూవీ కావడం వల్ల దీన్ని పాన్ ఇండియాగా తెరకెక్కించాలని మహీ వీ రాఘవ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దీన్ని విడుదల చేయాలని కూడా ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీక్ గాంధీని వైఎస్ జగన్ పాత్రలో నటింపజేయడం వల్ల పాన్ ఇండియాగా మార్చాలనేది ఆయన ప్రయత్నమని, స్కామ్ 1992 హిట్‌తో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు ప్రతీక్ గాంధీ సరిపోతాడని ఆయన భావిస్తోన్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+