ప్రణబ్‌కి జగన్ రాజ్యాంగ వివరణ, మార్టిన్ కవిత(పిక్చర్స్)

న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్‌ని, డిఎంకె ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి నెపోలియన్‌లను కలిసి సమైక్య గళం వినిపించారు. కేంద్రం విభజన విషయంలో ఏకపక్షంగా వెళ్తోందని న్యాయం చేయాలని కోరారు. అప్రజాస్వామికంగా, ఏకపక్షంగా వెళ్తున్న విభజనను ఆపాలని కోరారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 గురించి, 371 (డి) గురించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సుదీర్ఘంగా వివరించానని వైయస్ జగన్ రాష్ట్రపతిని కలిసిన అనంతరం విలేకరులతో తెలిపారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్రప్రదేశ్ గురించి పలువురు నేతలకు సమర్పించిన వినతి పత్రాలనే వీరికి కూడా సమర్పించామని జగన్ చెప్పారు.

సమైక్యాంధ్రప్రదేశ్ అవసరం గురించి, ఆర్టికల్ 3 గురించి రాష్ట్రపతికి వివరించినట్లు తెలిపారు. ఆర్టికల్ 3కి సవరణలు చేయాలని కోరానన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వారు రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఓట్లు, సీట్ల కోసం విభజించటం సంప్రదాయంగా మారితే ఇది ఆంధ్రప్రదేశ్‌తోనే ఆగిపోదని చెప్పానన్నారు.

జగన్ 1

జగన్ 1

రాష్ట్రాల విభజనకు ఒక పద్ధతి తీసుకురావాలని రాష్ట్రపతిని కోరినట్లు జగన్ చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే రెండు ప్రాంతాల్లో తాగేందుకు నీరు కూడా లేని పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు.

జగన్ 2

జగన్ 2

371 (డి) గురించి కూడా చెప్పామని, అన్నీ సానుకూలంగా విన్న రాష్ట్రపతి వీటన్నింటిపైనా ఆలోచిస్తానని చెప్పినట్లు జగన్ పేర్కొన్నారు.

జగన్ 3

జగన్ 3

రాష్ట్రపతికి సమర్పించిన వినతి పత్రంలో జగన్ మరోమారు మార్టిన్ కవితను ఉటంకించారు. ఆర్టికల్ 3ని సవరించాల్సిన అవసరముందని, ఈ అంశంపై తమకు మద్దతు ఇవ్వాలని శరద్ యాదవ్‌ను కోరినట్లు జగన్ చెప్పారు.

జగన్ 4

జగన్ 4

రాష్ట్ర విభజనకు అసెంబ్లీలోనూ, పార్లమెంటులోనూ మూడింట రెండొంతుల మెజార్టీ తప్పనిసరి అయ్యేలాగా ఆర్టికల్ 3ని సవరించాలని ఆయన కోరారు.

జగన్ 5

జగన్ 5

రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌పై రుద్దటం సమంజసం కాదని జేడీయూ అధినేత శరద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటుపై బిల్లు చర్చకు వచ్చినప్పుడు తమ వైఖరి ఏమిటో చెబుతామన్నారు.

జగన్ 6

జగన్ 6

కెసిఆర్ వచ్చి కలిసినప్పుడు తెలంగాణకు మద్దతు ఇచ్చారు కదా? అని అడగ్గా.. తానెప్పుడూ మద్దతు ఇవ్వలేదని శరద్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపాలని మాత్రమే తాను కేంద్రాన్ని కోరినట్లు పేర్కొన్నారు.

జగన్ 7

జగన్ 7

రాష్ట్రపతి, శరద్ యాదవ్‌లను కలిసిన బృందంలో జగన్‌తో పాటు పార్టీ నాయకులు మైసూరారెడ్డి, మేకపాటి, ఎస్పీవై రెడ్డి, బాలశౌరి, సుభాష్ చంద్రబోస్ తదితరులు ఉన్నారు.

జగన్ 8

జగన్ 8

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్‌ని, డిఎంకె ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి నెపోలియన్‌లను కలిసి సమైక్య గళం వినిపించారు.

జగన్ 9

జగన్ 9

కేంద్రం విభజన విషయంలో ఏకపక్షంగా వెళ్తోందని న్యాయం చేయాలని కోరారు. అప్రజాస్వామికంగా, ఏకపక్షంగా వెళ్తున్న విభజనను ఆపాలని కోరారు.

జగన్ 10

జగన్ 10

రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 గురించి, 371 (డి) గురించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సుదీర్ఘంగా వివరించానని వైయస్ జగన్ రాష్ట్రపతిని కలిసిన అనంతరం విలేకరులతో తెలిపారు.

జగన్ 11

జగన్ 11

ఈ సందర్భంగా సమైక్యాంధ్రప్రదేశ్ గురించి పలువురు నేతలకు సమర్పించిన వినతి పత్రాలనే వీరికి కూడా సమర్పించామని జగన్ చెప్పారు. సమైక్యాంధ్రప్రదేశ్ అవసరం గురించి, ఆర్టికల్ 3 గురించి రాష్ట్రపతికి వివరించినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+