వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి తర్వాత జగన్ సాహసం!: న్యూజిలాండ్‌లో బంగీ జంప్ (వీడియో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

న్యూజిలాండ్‌లో వైయస్ జగన్మోహన్ రెడ్డి బంగీ జంప్ (వీడియో)

కవేరో/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన విమర్శలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వేసిన సెటైర్లో లేక ఆయన ప్రజా సంకల్ప యాత్రకు సంబంధించిన వీడియోనో కాదు.

గత ఏడాది ఆయన సాహసానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 2017లో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభానికి ముందు ఆయన న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అక్కడ బంగీ జంప్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

కవెరో బ్రిడ్జి పైనుంచి బంగీజంప్

కవెరో బ్రిడ్జి పైనుంచి బంగీజంప్

వైయస్ జగన్మోహన్ రెడ్డి తన న్యూజిలాండ్ పర్యటనలో పెద్ద సాహసమే చేశారు. బంగీ జంప్‌లకు పేరెన్నిక గల కవెరో బ్రిడ్జి నుంచి ఆయన బంగీ జంప్ చేశారు. తన కుటుంబంతో కలిసి పాదయాత్రకు ముందు సరదాగా న్యూజిలాండ్ వెళ్లిన జగన్.. అక్కడి కవెరో బ్రిడ్జి పై నుంచి ఈ సాహసం కృత్యం ప్రదర్శించారు.

పాదయాత్రకు ముందు సాహసం

పాదయాత్రకు ముందు సాహసం

జగన్ గత పాదయాత్ర ప్రారంభానికి ముందు న్యూజిలాండ్ వెళ్లి బంగీ జంప్ చేశారు. అయితే, ఆయన అక్కడ ఏం చేశారనే విషయం ఎవరికీ తెలియదు. ఫ్యామిలీతో కలిసి సరదాగా ట్రిప్‌కు వెళ్లారు. అంతవరకే తెలుసు. కానీ దాదాపు పది నెలలు కావొస్తున్నా ఆయన అక్కడ ఈ సాహసం చేసినట్లు వెలుగు కూడలేదు. ఇప్పుడు వారం పది రోజులుగా ఇందుకు సంబంధించిన ఫోటోలు, ఆ తర్వాత వీడియోలు వెలుగు చూశాయి.

ఆశ్చర్యపోతున్న అభిమానులు, నాయకులు

ఆశ్చర్యపోతున్న అభిమానులు, నాయకులు

తొలుత ఇందుకు సంబంధించిన ఫోటోలు వెలుగు చూశాయి. జగన్ బంగీ జంప్ చేశారంటూ వచ్చాయి. ఇప్పుడు వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఫోటోలు, వీడియోలు వచ్చే వరకు జగన్ అక్కడ బంగీ జంప్ చేసినట్లుగా ఎవరికీ దాదాపు తెలియదనే చెప్పవచ్చు. జగన్ సాహస కృత్యాన్ని చూసి జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు.

ఆయన జీవితమే సాహసయాత్ర

ఆయన జీవితమే సాహసయాత్ర

జగన్ బంగీ జంప్‌కు సంబంధించిన వీడియోలను వైసీపీ అభిమానులు, ఆ పార్టీ నేతలు కొందరు పోస్టు చేశారు. 'ధైర్యం కి నిలువెత్తు రూపం జగన్ అన్న

ఆ గుండెకు తెలిసింది ఒక్కటే దమ్ము దైర్యం, ఢిల్లీ గద్దెని డి కొట్టినా, సాహసం తో కూడీన ఆటలు ఆడాలన్నా, తెగించి ప్రజలకోసం వేల కిలోమీటర్లు నడవాలి అన్న బలమైన గుండె ధైర్యం కావాలి ఆ తెగింపు ఆ సాహసం ఒక్క జగన్ అన్న కె సొంతం. అందుకే ఆయన జీవితమే ఒక సహాస యాత్ర ..ఓ నాయకుడా సలాం. పార్టీకి సంబంధం లేదన్నారు గా, కానీ ఇది మా క్రెడిబిలిటీ, బ్రాండ్, కెపాసిటీ, టీం వర్క్, వైఎస్సార్ కుటుంబం మామీద ఉంచిన నమ్మకం. మమ్మల్ని వైఎస్సార్ కుటుంబం నుండి ఎవడూ విడదీయలేడు, ఎవరో నలుగురు బోకు వెధవలు వాళ్ళ బోకు జోకులతో వాళ్ళలో వాళ్ళే నవ్వుకోటానికి తప్ప ఆ పేపర్ ముక్క మాకు వైఎస్సార్ కుటుంబం తో ఉన్న అనుబంధాన్ని ఇప్పటికి ఎప్పటికి విడదీయలేరు.' అంటూ రవీంద్ర ఇప్పాల పోస్ట్ చేశారు.

వీడియో పోస్ట్ చేసిన కొడాలి నాని

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు. జగన్ బంగీ జంప్ అంటూ ఆ వీడియోను తన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. గత ఏడాది అక్టోబర్ చివరి వారంలో జగన్ కవెరో బ్రిడ్జి నుంచి 134 మీటర్ల నీళ్ల లోతులోకి బంగీ జంప్ చేశారు.

చిరంజీవి బావగారు బాగున్నారా సమయం నుంచి బాగా తెలిసింది

చిరంజీవి బావగారు బాగున్నారా సమయం నుంచి బాగా తెలిసింది

గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా బంగీ జంప్ చేశారు. మనకు దీని గురించి బాగా తెలిసింది అప్పటి నుంచే. అప్పుడు చిరంజీవి అలా బంగీ జంప్ చేయడాన్ని చూసి అభిమానులు, వీక్షకులు నోరెళ్లబెట్టారు. చల్నే దో గాడీ పాటలో చిరంజీవి బంగీ జంప్ చేశారు. ఆ తర్వాత కూడా చాలామంది చేశారు. కానీ ఇప్పుడు ఓ రాజకీయ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు జగన్ అలాంటి సాహసకృత్యం చేయడంతో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

English summary
YS Jaganmohan Reddy's vacation in New Zealand isn't without adventures. YSRCP Chief had even attempted bungee jump at the famous Kawarau Bridge during this family trip. Pictures and Video Footage of the gutsy feat has gone viral on Social Media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X