చికెన్ విత్ ఆలూ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా..? తింటే అస్సలు వదిలిపెట్టరు..!

చికెన్ అనగానే చాలామందికి నోరూరుతుంది. చికెన్ ను పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. చికెన్ తో రకరకాల వంటలు తయారు చేస్తారు. అయితే ఎలా చేసినా చికెన్ టేస్టీగానే ఉంటుంది. మరి చికెన్ తో ఆలూ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా..? టేస్టు అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీని తయారు చేసుకోవడం కూడా ఈజీనే.. మరి చికెన్- ఆలూ ఫ్రై కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..

చికెన్ విత్ ఆలూ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు చికెన్ 500 గ్రాములు, బంగాళాదుంపలు మూడు లేదా నాలుగు, ఉల్లిపాయలు రెండు మీడియం సైజు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి మూడు లేదా నాలుగు, నూనె మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు, పసుపు అర టేబుల్ స్పూన్, కారం ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా అర టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర తగినంత తీసుకోవాలి.

చికెన్ విత్ ఆలూ ఫ్రై కర్రీ తయారీ విధానం చూస్తే ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలాగే బంగాళాదుంపలు, ఉల్లిపాయలను ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసి వేడిచేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేయించాలి. ఇప్పుడు అందులో చికెన్ ముక్కలను వేసి మరో 5 నిమిషాలపాటు వేయించుకోవాలి.

Chicken with Aloo Fry Delicious Easy Recipe with Full Ingredients and Preparation Method Chicken

ఆ తర్వాత ఆ మిశ్రమంలో బంగాళాదుంప ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూతపెట్టి తక్కువ మంటపై కర్రీని ఉడికించుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు కూడా యాడ్ చేయవచ్చు. బంగాళాదుంపలు, చికెన్ ఉడికించుకున్న తర్వాత అందులోనే గరం మసాలా, కొత్తిమీర చల్లుకోవాలి. ఆ తర్వాత కర్రీ మొత్తం కలపాలి. అలా కాసేపు వేయించుకుని దింపుకోవాలి. అంతే సూపర్ టేస్టీ చికెన్ విత్ ఆలూ ఫ్రై రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+