జగన్ జిల్లా పర్యటనల షెడ్యూల్ ఖరారు..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లండన్ పర్యటన నుంచి వచ్చిన జగన్ తాజాగా పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. పథకాల అమలు పైన తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైన ప్రస్తావనకు వచ్చింది. అదే సమయంలో పార్టీ నేతలంతా ప్రజలతోనే ఎక్కువగా ఉండాలని జగన్ నిర్దేశించారు. మెడికల్ సీట్ల పై ప్రభుత్వ తీరు పై పోరుబాట చేపట్టాలని నిర్ణయించారు. ఇక, జిల్లాల వారీగా పర్యటనలు.. పార్టీ సమావేశాల నిర్వహణ పైన జగన్ స్పష్టత ఇచ్చారు.
పార్టీ నేతలతో భేటీ
పార్టీ ముఖ్య నేతలకు జగన్ కీలక దిశా నిర్దేశం చేసారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పైన చర్చించారు. ప్రభుత్వం పైన ఎనిమిది నెలల కాలంలోనే వ్యతిరేకత కనిపిస్తోందని పార్టీ నేతలు జగన్ కు వివరించారు. మార్చి 12న వైసీపీ ఆవిర్బావ దినోత్సవం నాడు నిర్వహించే కార్యక్రమాల పైన కార్యాచరణ ఖరారు చేసారు. వైద్య కళాశాలల ప్రయివేటీకరణ.. సీట్ల తగ్గింపు అంశం పైన పోరుబాట నిర్వహించాలని పార్టీ నేతలకు జగన్ సూచించారు. పెన్షన్ల కోత విధిస్తున్న విధానం.. ఎంత మంది లబ్ది దారులు జిల్లాల వారీగా పెన్షన్లు నష్టపోతున్నారనే లెక్కలను జగన్ ఆరా తీసారు. అదే విధంగా కేంద్ర బడ్జెట్ కేటాయింపుల పైన చర్చ జరిగింది.

కీలక నిర్ణయాలు
పోలవరం ఎత్తు కుదింపు.. నిధుల ప్రకటన అంశం పైన సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం ఎత్తు తగ్గించటం ద్వారా ప్రాజెక్టు లక్ష్యం దెబ్బ తిని.. కేవలం ఒక డామ్ తరహాలో పోలవరం నిలిచే అవ కాశం ఉందనే అభిప్రాయం వెల్లడైంది. స్టీల్ ప్లాంట్ కు కేంద్ర నిధులు.. ప్రణాళికల పైనా చర్చకు వచ్చింది. విజయవాడలో ముంపు ప్రాంతానికి నిధుల గురించి పట్టించుకోవటం లేదని.. ప్రభుత్వం చేస్తున్న అప్పుల అంశాన్ని జగన్ వద్ద నేతలు ప్రస్తావించారు. నేతలంతా జిల్లాల వారీగా స్థానిక అంశాల పైన కార్యాచరణ ఖరారు చేసుకొని.. ప్రజలతోనే మమేకం అవ్వాలని జగన్ నిర్దేశించారు. పార్టీ కేడర్ తో ఎక్కువగా ఉంటూ... కలిసి కట్టుగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాల గురించి చర్చ జరిగింది.
జిల్లా పర్యటనలు
బడ్జెట్ సమావేశాలు కావటంతో హాజరు అవ్వాల్సిన అంశం పైన నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు. ఇక, జగన్ ఉమ్మడి జిల్లాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశాలను పూర్తి చేసిన తరువాత జిల్లాల పర్యటనలు ప్రారంభిస్తానని నేతలకు స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ఏడు జిల్లాల నేతలతో సమావేశాలు పూర్తయ్యాయని.. మిగిలినవి పూర్తి చేయాల్సి ఉందని నేతలకు వివరించారు. వీటిని పూర్తి చేసి ఉగాది నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభిస్తానని జగన్ స్పష్టం చేసారు. తొలుత సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటనలు ప్రారంభిస్తానని జగన్ చెప్పినా.. లండన్ పర్యటన తో వాయిదా పడింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తో ఇక, ఉగాది నుంచి తన పర్యటన లు ఉంటాయని జగన్ వెల్లడించారు












Click it and Unblock the Notifications