పాదయాత్ర ఇంకా ముందే ప్రారంభం: 'మావిగన్' ఆషామాషీగా చెప్పలేదు- జగన్..!!
మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. మావిగన్ ప్రతిపాదన ద్వారా కొత్త చర్చకు తెర లేపిన జగన్.. ఇప్పుడు అసలు తన ప్రతిపాదన వెనుక లక్ష్యాలను వెల్లడించారు. అమరావతిలో అవినీతి జరుగుతోందని... దోచేస్తున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో మహిళలకు భద్రత లేదని చెప్పిన జగన్.. ఒక పత్రికాధిపతి దుర్మార్గ వ్యాఖ్యలు చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయనకు ఆ ముగ్గరు మద్దతు ఇస్తారా అంటూ ఫైర్ అయ్యారు. పాదయాత్ర పైనా జగన్ స్పష్టత ఇచ్చారు
మాజీ ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర పైన ప్రకటన చేసారు. గతంలో చెప్పిన దాని కంటే ముందే పాదయాత్ర ఉంటుందని స్పష్టం చేసారు. వచ్చే ఏడాది జూలై నుంచి తన పాదయాత్ర మొదలు అవుతుందని వెల్లడించారు. పాదయాత్ర నుంచి కూటమి నేతలకు సినిమా మొదలవుతుందని హెచ్చరించారు. జగన్ ఇచ్చే పథకాల కంటే ఎక్కువ ఇస్తామని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని.. ఉన్న వాటిని తీసేసారని ఆరోపించారు. తన పాలనలో 2.73 లక్షల కోట్ల పేదలకు పంచామని.. ఇప్పుడు ఆ డబ్బు ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబు తెచ్చిన అప్పులు ఎవరి జేబుల్లోకి వెళ్లాలని నిలదీసారు. చంద్రబాబు పాలన దోచుకో, దాచుకో అన్నట్లుగా మారిందని జగన్ విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళల పైన వేధింపులు పెరిగాయని ఆరోపించారు. ఒక పత్రికాధిపతి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆ పత్రికాధిపతి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు, పవన్ ,లోకేష్ సమర్థించటం పైన జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

మావిగన్ ప్రతిపాదన వెనుక.. అమరావతిలో అవినీతి
ఇక, మావిగన్ ఆషామాషీగా చేసిన ప్రతిపాదన కాదని జగన్ స్పష్టం చేసారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని మరోసారి చెప్పుకొచ్చారు. అయితే, అమరావతి కోసం చేస్తున్న ఖర్చు.. అందులో చేస్తున్న అవినీతి గురించి ఆలోచన చేయాలని సూచించారు. అమరావతిలో అవినీతి జరుగుతోంద ని.. అక్కడ నిర్మాణాల పేరుతో కమీషన్లు దండుకుంటు న్నారని ఆరోపించారు. 120 కిలీ మీటర్ల రాజధాని కారిడార్ గా మావిగన్ ప్రతిపాదన చేసామని చెప్పుకొచ్చారు. మూడు రాజధానులు ఆమోదం కాకుంటే మావిగన్ ప్రతిపాదన పరిశీంచాలని సూచించామని చెప్పారు. అయితే, మావిగన్ పైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతిలో కట్టే బిల్డింగ్స్ ఇక్కడే కట్టమన్నామని.. కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదని ఆరోపించారు. కూటమి నేతలే మహిళలను వేధిస్తున్నారని.. లిక్కర్ మాఫియా, బెల్టు షాపులు ప్రతీ గ్రామంలో కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చంద్రబాబు చేస్తున్నార ని..అమరావతి పేరు చెప్పి, రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
-
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
మావిగన్ పై స్పందన చూసి చంద్రబాబుకు వణుకుపుడుతోంది! -
కొత్త ఇళ్లు, స్థలాల పై ప్రభుత్వం కీలక నిర్ణయం- అర్హుల జాబితా.. పంపిణీ ముహూర్తం..!! -
రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు- ఆధారాలతో సహా.. ఇక నెక్స్ట్..!! -
అమరావతి ఇక ప్రత్యేకంగా - తాజా నిర్ణయం, కీలక మలుపు..!! -
నియామకాలు- పోస్టుల్లో కొత్త మార్పులు, ఉద్యోగుల బదిలీల పై కీలక నిర్ణయం .. ఇక నుంచి..!! -
Amaravati: అమరావతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల -
ఏపీలో మళ్లీ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్లు ? చంద్రబాబు అమరావతిపై ధర్మాన ఫైర్..! -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications