అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెప్పులతో వద్దు సరే, చీపుళ్లతో ఓకేనా: బాబుకు జగన్, కొట్టుకున్న టిడిపి-వైసిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

అనంతపురం: చెప్పులతో కొట్టాలని అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు ఫీలవుతున్నారని, మరి చీపురుతో కొడితే ఓకేనా అని వైసిపి అధినేత జగన్ ఆదివారం నాడు అన్నారు. బాబును చెప్పులతో కొట్టాలన్న వ్యాఖ్యల పైన టిడిపి భగ్గుమంటోంది. దీనిపై జగన్ తీవ్రంగా స్పందించారు.

జగన్ ఓడీసీలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ముఖ్యమంత్రిపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చని ముఖ్యమంత్రిని తరిమికొట్టాలన్నారు. మూడ్రోజులుగా చంద్రబాబుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

YS Jagan

ఓడిసీలో టిడిపి కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. దారి వెంబటి టిడిపి కార్యకర్తలు జగన్‌కు చెప్పులు చూపించారు. జగన్ గో బ్యాక్ అని నినదించారు. దీంతో, ఆయన అసహనానికి లోనయ్యారు. చెప్పులతో కొట్టమంటే పీలవుతున్నారని, చీపుర్లు ఓకేనా అన్నారు.

చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని జగన్ విమర్శించారు. మోసం చేసినా, జేబులు కొట్టినా 420 కింద కేసులు పెడతారని, మోసం చేసి సీఎం పదవిలో కూర్చున్న చంద్రబాబుపై ఏం కేసు పెట్టాలని ప్రశ్నించాు. మోసం చేస్తున్న చంద్రబాబును నిలదీయవద్దా అని ప్రశ్నించారు.

టిడిపి వర్సెస్ వైసిపి

అనంతపురం జిల్లా ఓబులదేవర చెరువులో రైతు భరోసా యాత్ర సందర్భంగా స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసిపి, టిడిపి శ్రేణుల పరస్పర దాడుల మధ్య జగన్‌ యాత్ర కొనసాగిస్తున్నారు. ఓబులదేవరచెరువు మండలం వడ్డివారిపల్లిలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న హరినాథ్ రెడ్డి కుటుంబాన్ని జగన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.

పరస్పర దాడి

అనంతపురంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. చంద్రబాబుపై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు జగన్ క్షమాపణ చెప్పాలంటూ అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ లో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

అదే సమయంలో వైసిపి కార్యకర్తలు ద్విచక్రవాహనాలతో ర్యాలీగా వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగి, పరస్పర దాడులు జరిగాయి. దీంతో, ఉద్రికత్త పరిస్థితులు చోటుచేకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు రెండు పార్టీలకు చెందిన పలువురుని అరెస్టు చేశారు.

English summary
YSRCP chief YS Jagan make controversial comments on AP CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X