జనరంజక పాలన, నా ఫోటో కూడా: జగన్(పిక్చర్స్)
కర్నూలు: రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే 30 ఏళ్లపాటు ప్రజలు గుర్తించుకునేలా జనరంజక పాలన సాగిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అలాంటి సత్తా తమకుందని ఆయన అన్నారు. దివంగత నేత వైయస్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఎలా పూజించారో అదే తరహాలో తన ఫొటో కూడా ప్రతి ఇంట్లో పెట్టుకునేలా జనరంజకంగా పాలిస్తామన్నారు.
రెండు రోజులపాటు సాగనున్న కర్నూలు జిల్లా పార్టీ సమీక్ష సమావేశాలను శుక్రవారం కర్నూలులో జగన్ ప్రారంభించారు. ఏ ప్రభుత్వానికైనా అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత ప్రజావ్యతిరేకత కనిపిస్తుందని అయితే ప్రస్తుత టిడిపి ప్రభుత్వంపై ఆర్నెళ్లకే ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోందని అన్నారు. అధికారం దక్కదన్న భయంతో అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
రైతుల రుణమాఫీ సాధ్యం కాదని అందరికీ తెలుసునని, అయితే కేవలం అధికారం కోసం చంద్రబాబు అమలు కాని హామీ ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల రుణాలు మాఫీ చేయాలంటే రూ.87 వేల కోట్లు అవసరమని జగన్ అన్నారు. అయితే చంద్రబాబు జిమ్మిక్కులతో దాన్ని వీలైనంత తగ్గించి చివరకు రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసి కేవలం రూ.5 వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారన్నారు.
చంద్రబాబు వస్తే రుణాలు మాఫీ అవుతాయని ఆశించిన రైతులు భంగపాటుకు, మోసానికి గురయ్యారన్నారు. అన్నదాతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారని అన్నారు. రుణాలు మాఫీ కాకపోగా తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఎదురుకావడంతో బాబు మోసాన్ని రైతులు గుర్తించారన్నారు. మహిళలకు ఇచ్చిన హామీని ఎలాంటి షరతులు లేకుండా తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

వైయస్ జగన్
రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే 30 ఏళ్లపాటు ప్రజలు గుర్తించుకునేలా జనరంజక పాలన సాగిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఆ సత్తా తమకుందని ఆయన అన్నారు.

వైయస్ జగన్
దివంగత నేత వైయస్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఎలా పూజించారో అదే తరహాలో తన ఫొటో కూడా ప్రతి ఇంట్లో పెట్టుకునేలా జనరంజకంగా పాలిస్తామన్నారు.

వైయస్ జగన్
రెండు రోజులపాటు సాగనున్న కర్నూలు జిల్లా పార్టీ సమీక్ష సమావేశాలను శుక్రవారం కర్నూలులో జగన్ ప్రారంభించారు.

వైయస్ జగన్
ఏ ప్రభుత్వానికైనా అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత ప్రజావ్యతిరేకత కనిపిస్తుందని అయితే ప్రస్తుత టిడిపి ప్రభుత్వంపై ఆర్నెళ్లకే ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోందని అన్నారు.












Click it and Unblock the Notifications