సాయిరెడ్డి బాధ్యతలు ఆ సీనియర్ కు- జగన్ అనూహ్య నిర్ణయం..!!
ఏపీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ లో కూటమి ప్రభుత్వం వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. అటు పాలనా పరంగా - పార్టీ లో ఆసక్తి కర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సమయంలోనే వైసీపీలోనూ పలు మార్పులు జరుగుతున్నాయి. ముఖ్య నేత సాయిరెడ్డి రాజీనామాతో జగన్ అలర్ట్ అయ్యారు. ఈ నెల 3, 4 తేదీల్లో పార్టీ ముఖ్యులతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఇదే సమయంలో సాయిరెడ్డి బాధ్యత లను జగన్ మరో సీనియర్ నేతకు అప్పగించారు.
జగన్ కసరత్తు
వైసీపీ ముఖ్య నేత సాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ తరువాత పార్టీలో కొత్త చర్చ మొదలైంది. వైసీపీ లో వరుసగా నేతలు పార్టీ వీడటం పైన కొంత డైలమా పరిస్థితి కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ ముఖ్య నేతలే లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. వైసీపీ కీలక నేతల పైన ఒత్తిడి పెంచేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో, లండన్ పర్యటన ముగించు కొని నేడు బెంగళూరు వస్తున్న జగన్.. ఫిబ్రవరి 3,4 తేదీల్లో తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు. 5వ తేదీన వైసీపీ ఫీజు రీయంబ్స్ మెంట్ పైన పోరుబాటకు నిర్ణయం తీసుకుంది.

బాధ్యతల ఖరారు
ఇక, సాయిరెడ్డి పార్టీకి ఇప్పటి వరకు కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల లో పార్టీ ప్రతినిధిగా పని చేసారు. జగన్ కు ఢిల్లీలో కీలకంగా మారారు. కానీ, సాయిరెడ్డి తాజా నిర్ణయం తో ఇప్పుడు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో నెంబర్ టూ గా ఉన్న సాయిరెడ్డి స్థానం లో ఎవరికి బాధ్యతలు ఇవ్వాలనే అంశం పైన జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జగన్ కోటరీలో కీలక స్థానాల్లో ఉన్న నేతల బాధ్యతల్లో సైతం మార్పుల దిశగా జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో.. సాయిరెడ్డి స్థానంలో ఢిల్లీలో బాధ్యత కేటాయింపు పైన జగన్ తాజా పార్టీ నేతలతో చర్చించారు.
జిల్లాల పర్యటన
దీంతో, ఇప్పటి వరకు సాయిరెడ్డి రాజ్యసభ వైసీపీ పక్ష నేతగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ స్థానాన్ని పార్టీకి చెందిన సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక..పార్టీ నేతలతో వరుస భేటీల సమయంలో మరిన్ని నియామకాలు.. మార్పుల పైన జగన్ ప్రకటన చేయనున్నారు. సాయిరెడ్డి నిర్ణయం తరువాత వైసీపీ రాజ్యసభ సభ్యులు మరి కొందరు పార్టీ వీడుతారనే ప్రచారం సాగుతోంది. కానీ, ఆ ఎంపీలు తాము పార్టీ మారటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక, అసెంబ్లీ సమావేశాలు.. జిల్లాల పర్యటనలకు జగన్ సిద్దం అవుతున్నారు.












Click it and Unblock the Notifications