చంద్రబాబు అదే చేస్తారు, నేను సిద్ధం - జగన్ కీలక నిర్ణయం..!!
ఏపీలో మరోసారి రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. అసెంబ్లీ స్సీకర్ గా అయ్యన్న పాత్రుడు పేరు ఖరారైంది. తొలి రోజున ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జగన్ ఈ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే చర్చ సాగుతున్న సమయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలకు ప్రతిపక్షంగా భవిష్యత్ కార్యాచరణ నిర్దేశించారు.
జగన్ టూర్ రద్దు
మాజీ ముఖ్యమంత్రి జగన్ పులివెందుల పర్యటన రద్దయింది. ఈ రోజు, రేపు జగన్ కీలక సమావేశాలకు నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని ముందుకు జరిపారు. 22కు బదులుగా ఈనెల 20నే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు. అలాగే పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వీరికి దిశానిర్దేశం చేయనున్నారు.

అసెంబ్లీకి హాజరు
జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించారు. ప్రతిపక్ష హోదా దక్కదనే ప్రచారం ఉంది. కేవలం 11 సీట్లకే పరిమితం కావటంతో జగన్ కు సభలో ఇచ్చే సీటింగ్ పైన ఆసక్తి ఉంది. అయితే, జగన్ పార్టీ ముఖ్యులతో కీలక వ్యాఖ్యలు చేసారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్న వారు ఎలా వ్యవహరించినా..ప్రజల వాయిస్ వినిపించేందుకు సభలో అన్ని ప్రయత్నాలు చేద్దామని పేర్కొన్నారు. అదే సమయంలో చంద్రబాబు తాను ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని చెబుతున్నారని..కొంత సమయం ఇద్దామని జగన్ వ్యాఖ్యానించారు.
ఇలా ముందుకెళ్దాం
చంద్రబాబు ప్రభుత్వానికి నిర్దేశిత సమయం తరువాత ప్రజల తరుపున వాయిస్ వినిపిద్దామని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలను వేచి చూద్దామని చెప్పుకొచ్చారు. సీట్ల సంఖ్య కంటే వచ్చిన ఓట్లను గుర్తుంచుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీ కేడర్ పైన దాడులు జరుగుతున్నాయని..నేతలంతా వారికి అండగా నిలవాలని నిర్దేశించారు. అసెంబ్లీ సమావేశాల తరువాత జగన్ పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. అయితే..సభలో జగన్ తో అధికార పార్టీ వ్యవహార శైలి ఎలా ఉంటుంది.. జగన్ ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications