పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలు రద్దు..! వైఎస్ జగన్ డిమాండ్..!
ఏపీలో ఇవాళ కడప, రాజంపేట జిల్లాల్లో జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికలు అవాంఛనీయ ఘటనల మధ్య ముగిశాయి. చాలా చోట్ల ఓటు వేయనివ్వలేదనే ఫిర్యాదులు, బెదిరింపులు, రిగ్గింగ్ జరిగినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఉపఎన్నికలు జరిగిన తీరుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు ఉపఎన్నికల్ని రద్దు చేసి తిరిగి అక్కడ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జడ్పీటీసీ సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట జడ్పీటీసీ సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేశారని జగన్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారని, సీఎంగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగంచేస్తూ, అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని, పోలీసులను వాడుకుని, ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారన్నారు. ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఇవాళ నిజంగా ఒక బ్లాక్ డే అన్నారు.

కాబట్టి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు సీట్లో ఉండగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది ఒక డొల్ల మాత్రమే అని, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు, ప్రజాస్వామ్య పద్ధతులు అన్నవి ఒట్టిమాటలేనని, వ్యవస్థలనేవి కేవలం అలంకార ప్రాయం మాత్రమేనని మరోమారు రుజువైందన్నారు.
ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓట్లేసేలా చూడటం, ఆ మేరకు ప్రజలకు సహకరిస్తూ, తగిన సదుపాయాలు ఇస్తూ, ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం అన్నది ప్రభుత్వ విధి అని, కాని చంద్రబాబు ప్రభుత్వాన్ని వాడుకుని తన ప్రభుత్వ సిబ్బంది, పోలీసుల చేతే ఏకంగా రిగ్గింగ్ చేయించారన్నారు. మరి దీన్ని ఎన్నిక అని ఎలా అనగలుగుతామని ప్రశ్నించారు. చంద్రబాబు ఓట్లను రిగ్గింగ్ చేయగలరేమో కాని, ప్రజల హృదయాలను కాదన్నారు.
ఎన్నికలు ఏవైనా ఏ గ్రామంలో ఓటర్లకు అదే గ్రామంలో పోలింగ్ నిర్వహించడం గతం వరకూ నుంచో పాటిస్తున్న విధానమని, కాని చంద్రబాబు ఆదేశాల మేరకు పులివెందుల జడ్పీటీసీ పరిధిలోని పలు గ్రామాల పోలింగ్ బూత్‌లను అటు ఇటు మారుస్తూ, 2 కి.మీ, 4 కి.మీ.ల దూరానికి మార్చినప్పడే క్షుద్ర రాజకీయానికి నాందిపడిందన్నారు. మరోవంక నిన్న రాత్రి నుంచే ఎన్నికలు జరుగుతున్న ప్రతి గ్రామంలోకి, సుమారు 200 మంది చొప్పున బయట ప్రాంతాలకు చెందిన టీడీపీ వాళ్లు యథేచ్ఛగా చొరబడి, తెల్లవారుజామునుంచే ఓటర్లను బయటకు రానివ్వకుండా దిగ్బంధించి, బూత్‌లను ఆక్రమించుకున్నారన్నారు.
పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న ZPTC సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్టZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న… pic.twitter.com/aXclpoCv77
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 12, 2025
ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బయట ప్రాంతాలకు చెందిన తమ టీడీపీ నాయకులతో, కార్యకర్తలతో ఓట్లేయించారన్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన ఏజెంట్లు బూత్‌ల్లో కనీసం కూర్చోనీయలేదన్నారు. ఓటర్లను బూత్‌ల వైపునకు రానీయకుండా ఎక్కడికక్కడ భయపెట్టారన్నారు. తరిమి కొట్టి రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్నారు. మహిళా ఏజెంట్లపైన కూడా దాడులు చేశారని, స్వేచ్ఛగా ప్రజలు ఓట్లేయడానికి కాపలాకాయాల్సిన డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఇతర పోలీసులు, చంద్రబాబు తప్పుడు ఆదేశాలకు తలొగ్గుతూ, టీడీపీ వాళ్లు చేసే దాడులు, దౌర్జన్యాలకు దగ్గరుండి కాపలా కాశారన్నారు.

పోనీ తనకే ప్రజలు ఓట్లేస్తారని అనుకున్నప్పుడు చంద్రబాబుగారు, ఇన్ని దౌర్జన్యాలు, అరాచకాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తనకే ఓట్లేస్తారని అనుకున్నప్పుడు, ఆ ధైర్యం, నమ్మకం ఉన్నప్పుడు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా ఓటర్లను స్వేచ్ఛగా వదిలేసేవారు కదా అన్నారు. ఓటర్లు ఉన్న దగ్గరే పోలింగ్ బూత్‌లు పెట్టేవాడు కదా? ఆ నమ్మకం లేదు కాబట్టే చంద్రబాబుగారు ఈ అరాచకాలన్నీ చేశారన్నారు. 2017 నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా చంద్రబాబు ఇదే తరహా కుట్రతో అరాచకాలు చేశారన్నారు. అప్పుడు అభ్యర్ధిని గెలిపించుకున్నా ఏడాదిన్నర తర్వాత అక్కడే 34 వేల ఓట్ల తేడాతో వైసీపీ గెలిచిందన్నారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications