ఏపీ ప్రభుత్వానికి జగన్ హెచ్చరిక - స్వయంగా వస్తా..!!

అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని జగన్ పరామర్శించారు. అచ్యుతాపురం ఘటనలో బాధిత కుటుంబాల‌కు పరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగితే బాధితుల పక్షాన వైసీపీ పోరాడుతుంద‌ని చెప్పారు. వారి కోసం తానే స్వయంగా నేనే ధర్నాకు వస్తాన‌ని జగన్ హెచ్చరించారు. అ ఘటన లో ప్రభుత్వం తీరు సరికాదని వ్యాఖ్యానించారు.

పరామర్శ
అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. కార్మిక శాఖ మంత్రి కూడా తన దగ్గర ప్రమాదం వివరాలు లేవన్నారని చెప్పుకొచ్చారు. ఎంత మంది చనిపోయారో తెలియదన్నారు. ఘటనా స్థలానికి ఆంబులెన్సులు కూడా రాని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. బాధితుల్ని కంపెనీ బస్సుల్లో తీసుకొచ్చారని జగన్ వివరించారు. తమ హయాంలో ఇలాంటి ఘటనే జరిగిందని గుర్తు చేసుకున్నారు. కోవిడ్ సమయంలో ఎల్జీ పాలిమర్స్ లో ఘటన జరిగితే 24 గంటల్లో పరిహారం ఇప్పించామని జగన్ చెప్పారు.

YS Jagan demands to pay exgratia immeadiately to the families of those who lost their lives in Atchutapuram explosion

పరిహారం చెల్లించాలి
నాడు ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు. గంట్లలోనే రూ.30 కోట్లు పరిహారం సొమ్ము పంపించామని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం తమ ప్రభుత్వంలా స్పందించలేదన్నారు. కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం స్పందించిన తీరు బాధగా అనిపిస్తోందన్నారు. ఈ ఫ్యాక్టరీలో ప్రమాదంలో ఎలా జరిగిందో లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసారు. పరిహారం అనేది సానుభూతితో ఇవ్వాలన్నారు. ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలని సూచించారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

శ్రద్ద పెట్టాలి
రెడ్‌ బుక్‌ మీద పెట్టిన శ్రద్ధ.. ఇలాంటి వాటి మీద పెట్టి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగి ఉండేవికావన్నారు. కార్మికులు చనిపోయేవారు కాదు. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికే ఈ ప్రభుత్వం దృష్టి పెడుతోందని జగన్ విమర్శించారు. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. రైతులకు పెట్టుబడి కింద ఒక్క రూపాయి సాయం ఇవ్వలేదన్నారు. ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేశారన్నారు. స్కూల్స్‌, ఆస్ప్రతులు, పరిశ్రమలు.. అన్ని వ్యవస్థలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. కొట్టడం, చంపడం ఆస్తుల ధ్వంసం చేయడమే ఈ ప్రభుత్వ పాలనలో కనిపిస్తుంద‌ని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+