వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
పులివెందుల వేదికగా షర్మిల పై జగన్ విరుచుకుపడ్డారు. ఎక్కడా షర్మిల పేరెత్తకుండానే టార్గెట్ చేసారు. పసుపు చీరతో వెళ్లి వారికి ఇచ్చిన సంకేతాలు ఏంటని ప్రశ్నించారు. వైఎస్సార్ వ్యతిరేకుల కుట్రలో భాగంగా కొందరు తాము వైఎస్సార్ వారసులమంటూ ముందకు వస్తున్నారని మండిపడ్డారు. మహానేతకు వారుసులు ఎవరో చెప్పాల్సింది ప్రజలేనని స్పష్టం చేసారు. తన కుటుంబ సభ్యులను కోటీశ్వరలను చేయటానికి కాదు తాను సీఎం అయిందని జగన్ పేర్కొన్నారు. అవినాశ్ తప్పు చేయలేదని తాను బలంగా నమ్మానని స్పష్టం చేసారు.
టార్గెట్ షర్మిల
ముఖ్యమంత్రి జగన్ పులివెందుల నుంచి సంచలన వ్యాఖ్యలు చేసారు. షర్మిల, సునీత లక్ష్యంగా అనేక అంశాలను ప్రస్తావించారు. తాను అధికారంలోకివచ్చిన తరువాత తమను పక్కన పెడుతున్నారని ప్రచారం చేస్తున్నారని...తాను అధికారంలోకి వచ్చింది తన కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేయటానికి కాదని కీలక వ్యాఖ్యలు చేసారు. వివేకాను హత్య చేసింది ఎవరో జిల్లా ప్రజలకు ,దేవుడికి తెలుసని జగన్ చెప్పుకొచ్చారు. అవినాశ్ ఎవరు ఫోన చేస్తే వెళ్లారో ప్రతీ సందర్భంలో చెప్పారన్నారు. అవినాశ్ తప్పు చేయలేదని తాను బలంగా నమ్మిన కారణంగానే తాను టికెట్ ఇచ్చానని జగన్ వెల్లడించారు. అవినాశ్ జీవితం నాశనం చేయాలని కుట్రలు చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు.

వీళ్లా వారసులు
టీడీపీ అండ్ టీం చేస్తున్న వారి కుట్రలో తన చెల్లెళ్లు భాగస్వాములయ్యారన్నారు. వైఎస్సార్ పై కేసులు పెట్టింది, కుట్రలు చేసింది ఎవరని జగన్ ప్రశ్నించారు. వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేసిందెవరని ప్రశ్నించారు. నాయన పేరును సీబీఐ ఛార్జ్ షీట్ లో పెట్టిందెవరని నిలదీసారు. వైఎస్సార్ లెగసీ లేకుండా చేయాలని చూస్తుందెవరో చెప్పాలన్నారు. వైఎస్సార్ కుటుంబాన్ని అనగ దొక్కాలని..లేకుండా చూడాలని కుట్రలు చేసిందెవరో గుర్తు చేసుకోవాలన్నారు. అన్ని వ్యవస్థలు మన మీద ప్రయోగించి అదే కాంగ్రెస్, టీడీపీతో కలిసి వైఎస్ పేరు కలవకుండా చేయలనుకుంటున్న వారితో కలిసి మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిన వీళ్లా వైఎస్ వారసులు అంటూ జగన్ మండిపడ్డారు. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వారి స్క్రిప్టు మేరకు పని చేసే వారా వైఎస్ వారసులా అని జగన్ నిలదీసారు. టీడీపీ కుట్రలో భాగస్వాములవుతున్న వీళ్లా వైఎస్సార్ వారసులు అంటూ జగన్ ఫైర్ అయ్యారు.
జగన్ ను కొట్టలేరు
ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్సార్ లెగసీకి ఓటు వేసినట్లా..కుట్రలకు ఓటు వేసినట్లా అనేది ప్రతీ ఒక్కరు ఆలోచన చేయాలని కోరారు. తన ఇద్దరు చెల్లమ్మలను ఎవరు పంపారో...వారి వెనుక ఎవరు ఉన్నారో అందిరికీ తెలుసని చెప్పుకొచ్చారు. చిన్నాన్నను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే చెట్టా పట్టాల వేసుకొని తిరుగుతున్నారంటే అర్దం ఏంటని నిలదీసారు. వివేకాకు రెండో భార్య, సంతానం నిజం కాదా..వివేకాను చంపించిన వారిని గెలిపించాలని తిరగటం కంటే దిగజారుడు తనం ఉంటుందా అని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ లో చేరిన వారికి ఓటు వేస్తే ఎవరికి ప్రయోజనం కలుగుతుందో ఆలోచన చేయాలని సూచించారు. జగన్ ను పథకాల్లో, పాలనలో, మంచిలో కొట్టలేరన్నారు. ఎస్, మన కల్చర్ మంచి చేయటం, మంచి మనసు మన కల్చర్, మాట తప్పకపోవటం మన కల్చర్, బెదిరింపులకు లొంగకపోవటం మన కల్చర్. పులివెందులను తెలుగు సీమ నమ్మింది. కలిసి నడిచింది. పులివెందుల నుంచే విజయ గాధ కొనసాగిస్తామని జగన్ ధీమా వ్యక్తం చేసారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications