సంక్రాంతికి లోకేష్ ను వైఎస్ జగన్ నిరాశపరిచారా.. !? అనుకున్నదొకటి.. అయినది మరొక్కటి..

ఈ ఏడాది సంక్రాంతికి ఎన్నడూ లేని విధంగా ఓ అంశం టీడీపీ నేతల్ని, ముఖ్యంగా నారా లోకేష్ ను భయపెట్టింది. అసలే పవన్ కళ్యాణ్ తో పొత్తు కుదురుతున్న వేళ సంక్రాంతికి ఏ జరుగుతుందో ఏమోనని లోకేష్ ట్వీట్లలోనే ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైసీపీ ఈ సంక్రాంతికి ఏం చేయబోతోందో అంటూ టీడీపీ నేతలు కూడా భయపడ్డారు. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ అంతా సజావుగా సాగిపోయింది.

జగన్ పై నారా లోకేష్ భయాలు

జగన్ పై నారా లోకేష్ భయాలు

ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలు విడుదలయ్యాయి. అదే సమయంలో టీడీపీ-జనసేన పొత్తుకు సంబంధించి కూడా కీలక పరిణామాలు చోటు చేసుకోవడం మొదలైంది. దీంతో జగన్ సర్కార్ ఈ పొత్తు కుదరకుండా ఉండేందుకు వైసీపీ క్యాడర్ సాయంతో ఈ రెండు సినిమాల్ని పరస్పరం పోటీగా మారేలా, ఇంకా చెప్పాలంటే ఇరు అభిమానులు పోటాపోటీగా ప్రత్యర్ధులపై వార్ చేసుకునేలా చేస్తారని నారా లోకేష్ భయపడ్డారు. అదే విషయాన్ని ట్వీట్లు కూడా చేశారు.

లోకేష్ ను నిరాశపర్చిన జగన్ ?

లోకేష్ ను నిరాశపర్చిన జగన్ ?

కానీ లోకేష్ భయపడినట్లు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు మద్దతుగా, వ్యతిరేకంగా ఫ్యాన్స్ ఎలాంటి రచ్చ చేయలేదు. ఒకరోజు గ్యాప్ లో విడుదలైన రెండు చిత్రాల్ని ఎవరి అభిమానులు వారుగా ఆదరించారు. సంక్రాంతికి సాధారణ ప్రజలు కూడా ఆదరించడంతో రెండు చిత్రాలు దాదాపు ఒకే విధమైన టాక్ తో ముందుకెళ్లిపోయాయి. అదే సమయంలో వైసీపీ వైపు నుంచి కానీ, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేవు. దీంతో ఈ రెండు చిత్రాల సాకుతో కులాల పోరు రెచ్చగొడతారన్న లోకేష్ అంచనాల్ని ఇరు హీరోల ఫ్యాన్స్ తో పాటుప జగన్ తలకిందులు చేసినట్లయింది.

కీలకంగా పనిచేసిన చిరు-బాలయ్య పిలుపు ?

కీలకంగా పనిచేసిన చిరు-బాలయ్య పిలుపు ?

దాదాపు పదేళ్ల విరామం తర్వాత సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు పరస్పరం పోటీ పడ్డాయి. అయితే సంక్రాంతి వేళ అభిమానులు రెచ్చిపోకుండా ఇరువురు హీరోలు ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. వీరసింహారెడ్డికి చిరంజీవి.. అలాగే వాల్తేరు వీరయ్యకు బాలయ్య మద్దతు ప్రకటించారు. రెండు సినిమాలూ హిట్ కావాలని వీరిద్దరూ ఆకాంక్షించారు. అదే సందేశాన్ని అభిమానులకూ పంపారు. దీంతో అభిమానులు కులాల పేరుతోనో, మరో కారణంతోనే పరస్పరం తిట్టుకుంటూనో, కించపర్చుకుంటూనో మెసేజ్ లు పెట్టుకోవడం,ప్రచారాలు చేసుకోవడం చేయలేదు. దీంతో అంతా సజావుగా సాగిపోయింది.

జగన్ కట్టడి చేశారిలా.. !

జగన్ కట్టడి చేశారిలా.. !


అదే సమయంలో వైసీపీ శ్రేణులు చిరు-బాలయ్య మధ్య పరస్పరం పోరు రెచ్చగొట్టేందుకు మెసేజ్ లు పెడతారని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రచారాలు చేస్తారని అందిన సంకేతాలతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఓవైపు వైసీపీ నేతల్ని, కార్యకర్తల్ని కట్టడి చేయడంతో పాటు హీరోల ఫ్యాన్స్ కూడా ఎలాంటి అనుచిత చర్యలకు దిగకుండా అడ్డుకుంది. అంతే కాదు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాకు వైసీపీ ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్లి వీక్షించేందుకూ అనుమతిచ్చారు. దీంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనల్లేకుండా సంక్రాంతి శుభప్రదంగా ముగిసిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+