ప్రచారం చివరి రోజున సీఎం జగన్ బిగ్ స్కెచ్..!!
ఏపీ ఎన్నికల సమరం హోరాహోరీగా మారుతోంది. పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ పార్టీలు కొత్త వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి. పార్టీల అధినేత ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ప్రధాని మోదీ రెండు రోజులు ఏపీలో ప్రచారం చేస్తున్నారు. ఇటు జగన పార్టీ ముఖ్య నేతలతో చివరి అయిదు రోజుల ప్రచారం పైన సమీక్షించారు. చివరి రెండు రోజులు ప్రచారంలో బిగ్ టర్న్ గా భావిస్తున్నారు. చివరి రోజున తన ప్రచార సభల పైన జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
జగన్ మంత్రాంగం
పార్టీ ముఖ్య నేతలతో జగన్ కీలక సమావేశం నిర్వహించారు. 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం పైన సమీక్షించారు. గెలుపు అవకాశాల పైన సర్వే నివేదికల పైన అధ్యయనం చేసారు. ఈ నెల 11వ తేదీన ప్రచారం ముగియనుంది. దీంతో..ఈ రోజు జగన్ రేపల్లె,మాచర్ల, మచిలీపట్నంలో ప్రచారం చేస్తున్నారు. అటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రచారం సమయంలో చేసిన వ్యాఖ్యల పైన చర్చ జరిగింది. ఈ రోజు నుంచి ప్రధాని మోదీ ప్రచారం చేయనుండటంతో ఆ అంశం పైన చర్చ జరిగింది. ఇక..మిగిలిన అయిదు రోజులు ప్రచార షెడ్యూల్ పైన చర్చించారు. కూటమి ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్న నియోజకవర్గాల్లో ఎలక్షనీరింగ్ పైన జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు.

పిఠాపురం పై గురి
కూటమిలో కీలక నేతలుగా చంద్రబాబు, బాలయ్య, లోకేష్, పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీ స్పెషల్ ఆపరేషన్ అమలు చేస్తోంది. కుప్పం లో పరిస్థితి అనుకూలంగా ఉందని పార్టీ ముక్య నేతలు జగన్ కు నివేదించారు. హిందూపురంలో జగన్ ఇప్పటికే ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఇక..మంగళగిరి, పిఠాపురం లో జగన్ ప్రచారం గురించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 10న మంగళగిరిలో జగన్ ఎన్నికల సభకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ప్రచారం ఈ సభ ద్వారా చేయాలని భావిస్తున్నారు. దీని ద్వారా అక్కడ మరింత పార్టీకి అనకూలంగా మారుతుందని లెక్కలు వేస్తున్నారు.

చివరి సభపై నిర్ణయం
ఇక, పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో గెలుపు జనసేన - వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అక్కడ పవన్ టీడీపీ అభ్యర్ది వర్మ పైన నమ్మకం పెట్టుకున్నారు. గీతకు మద్దతుగా వైసీపీ నేతలు పిఠాపురం లో మకాం వేసారు. ఇటు పవన్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి 10వ తేదీన వీడియో విడుదల చేయనున్నారు. ిక..11న ప్రచారానికి చివరి రోజున పిఠాపురంలో జగన్ భారీ సభ నిర్వహించేలా వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఆ సభతోనే జగన్ తన ఎన్నికల ప్రచారం ముగిస్తారని చెబుతున్నారు. అదే వేదిక నుంచి జగన్ ఎన్నికల ప్రచారానికి ఫినిషింగ్ టచ్ గా కీలక ప్రకటన ఉంటుందని పార్టీలో ప్రచారం సాగుతోంది. దీంతో..చివరి రోజు ప్రచారం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications