Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!

ఏపీలో ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరింది. నేటితో నామినేషన్లు పూర్తి కానున్నాయి. ముఖ్యమంత్రి జగన్ పులివెందులలో తన నామినేషన్ దాఖలు చేసారు. అంతకుముందు పులివెందులలో జరిగిన సభలో సంచలన వ్యాఖ్యలు చేసారు. సోదరి షర్మిలను టార్గెట్ చేసారు. పులివెందుల, కడప, సీమ కల్చర్ గురించి మాట్లాడే వారికి సమాధానం ఇచ్చారు. రేపు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఎన్నికల ప్రచార యాత్రకు జగన్ సిద్దం అవుతున్నారు.

జగన్ నామినేషన్
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ పులివెందుల వైయ‌స్ఆర్ సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. పులివెందుల సీఎస్ఐ గ్రౌండ్‌లో బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన అనంత‌రం నేరుగా మినీ సెక్రటేరియట్‌లోని ఆర్వో ఆఫీస్‌కు వెళ్లారు. పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటికే జగన్ తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలైంది. ఈ రోజు నామినేషన్ దాఖలు చేయటంతో పాటుగా సభలో పాల్గొనటం ద్వారా జగన్ మలి విడత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జగన్ సతీమణి భారతి పులివెందులలో వారం రోజుల పాటు ప్రచారం చేయనున్నారు.

YS Jagan files nomination for Pulivendula Assembly key comments on Seema Culture

షర్మిల పై జగన్ వ్యాఖ్యలు
పులివెందుల సభలో జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్‌ అంటూ వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు ఎస్.. మంచి చేయడం మన కల్చర్‌.. మంచి మనసు మన కల్చర్‌.. మాట తప్పకపోవడం మన కల్చర్‌.. బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్‌ అంటూ జగన్ చెప్పుకొచ్చారు. పులివెందులను తెలుగు సీమ అభిమానించింది, నమ్మింది, కలసి నడిచిందని వివరించారు. ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలోనూ మన పులివెందుల, మన కడప, మన రాయలసీమ మంచితనం, మాటకు నిలబడే గుండె ధైర్యం అర్థమయ్యింది కాబట్టే, ఓ వైయస్‌ఆర్, ఓ జగన్‌ను ప్రతి మారుమూల గ్రామంలో కూడా అభిమానించేవాళ్లు కోట్ల మంది కనిపిస్తున్నారుని జగన్ చెప్పుకొచ్చారు.

పులివెందులలో భారతి ప్రచారం
వైయస్‌ఆర్‌ మీద కుట్రలు, కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని, వారి ఇళ్లకు వెళ్లి, వారికి మోకరిల్లి, వారి కుట్రలో భాగం అవుతూ, వారి స్క్రిప్టులను చదివి వినిపిస్తున్న వీళ్లా వైయస్‌ఆర్‌ అభిమానులు అంటూ షర్మిల పైన జగన్ ఫైర్ అయ్యారు. వివేకా హత్య కేసు గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. వివేకాకు రెండో వివాహం, సంతానం ఉందని గుర్తు చేసారు. ఎవరు ఫోన్ చేస్తే అవినాశ్ వెళ్లాడో గుర్తించాలన్నారు. వైఎస్సార్ ఎవరి మీద పోరాటం చేసారో..వారి కుట్రలో తన చెల్లెమ్మలు భాగస్వాములు అయ్యారన్నారు. అవినాశ్ తప్పు చేయలేదని తాను బలంగా నమ్ముతున్న కారణంగానే సీటు ఇచ్చానని జగన్ స్పష్టం చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+