బాబు మరోసారి మోసం చేస్తున్నారు, అలా చేస్తే..: ఏఎన్ఐతో జగన్

కృష్ణా: ఏపీకి ప్రత్యేక హోదా సాధనపై ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి లేదని ప్రతిపక్షనేత, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. దీక్ష పేరుతో చంద్రబాబు ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

జగన్‌ ప్రజాసంకల్పయాత్ర కృష్ణాజిల్లాలో కొనసాగుతోంది. నూజివీడు నియోజకవర్గంలో శోభనాపురం శివారు నుంచి 140వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ ఏఎన్‌ఐతో మాట్లాడారు.

వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలను పక్కదారి పట్టించడానికే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని జగన్ విమర్శించారు. చంద్రబాబు మళ్లీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని జగన్‌ మండిపడ్డారు. చివరి కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం జరిగినా చంద్రబాబు తగిన విధంగా స్పందించలేదన్నారు.

హోదా కోసం వైఎస్సార్‌ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి, ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని వైయస్‌ జగన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25మంది ఎంపీలు రాజీనామా చేస్తే హోదాపై దేశవ్యాప్త చర్చ జరిగేదని ఆయన అన్నారు. కేంద్రం కూడా దిగివచ్చేదని అన్నారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20న ఒకరోజు దీక్ష చేపడుతున్న విషయం విదితమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+