ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్, ఢిల్లీలో ధర్నా: మోడీని కలుస్తానంటూ జగన్

పల్నాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని, ఆటవిక పాలన కొనసాగుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. వినుకొండలో హత్యకు గురైన వైసీపీ నేత రషీద్ కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక.. హత్యలు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారన్నారు. అయినా, పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తామని చెప్పారు. ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో జులై 24న ధర్నా చేస్తామని తెలిపారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని చెప్పారు.

YS Jagan fires on Chandrababu govt for vinukonda murder issue

ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదు. రాష్ట్రంలో 490 చోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని, 560 ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. వెయ్యికి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. 45 రోజుల్లోనే 36 హత్యలు జరిగాయి. టీడీపీ వేధింపులతో 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 300లకు పైగా హత్యాయత్నాలు జరిగాయి. ఏపీలో పోలీసులు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. అండగా నిలవాల్సిన పోలీసులే బాధితులపై కేసులు పెడుతున్నారని జగన్ ఆరోపించారు.

సామాన్యుడైన రషీద్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా నరికి చంపారు. కేవలం వైసీపీ కోసం పనిచేశాడనే ఈ హత్య చేశారు. హత్య చేసిన జిలానీ వైసీపీ వ్యక్తి అని ప్రచారం చేశారు. రెండేళ్ల కిందట బైక్ కాలిన కేసులో.. ఇప్పుడు ఇది ప్రతీకారంగా జరిగిందంటూ కథనాలు ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. మిథున్ రెడ్డి, రెడ్డప్పలపై పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయన్నారు.

ఏపీలో అరాచక పాలనకు నిరసనగా జులై 24న ఢిల్లీలో ధర్నా చేపడతామన్నారు వైఎస్ జగన్. దేశ వ్యాప్తంగా చర్చ జరిగేలా ఆ ధర్నా చేస్తామన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రపతి, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోరతామన్నారు. వారికి రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తామని చెప్పారు. ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తామని జగన్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+