బైరెడ్డికి జగన్ కీలక బాధ్యతలు - టార్గెట్ ఫిక్స్..!!

ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం రాజకీయంగా వైసీపీ పైన గురి పెట్టింది. వైసీపీ హయాంలో అక్రమాలు జరిగాయంటూ వరుస విచారణలు చేస్తోంది. ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీ లిక్కర్ స్కాం పైన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే సమయం లో ఇటు జగన్ క్యాంప్ అలర్ట్ అయింది. 10 నెలల కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింద ని భావిస్తోంది. దీంతో, జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్న జగన్.. పార్టీలో కీలక నియామకాల పైన నిర్ణయాలు ప్రకటించారు.

జగన్ కొత్త నిర్ణయాలు
మాజీ సీఎం జగన్ పార్టీలో కీలక నియామకాలు చేపట్టారు. వైసీపీలో బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి కు తాజాగా బాధ్యతలు ఫిక్స్ చేసారు. యువతలో ఫాలోయింగ్ ఉన్న బైరెడ్డి సిద్దార్ధ రెడ్డికి వైసీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి వైసీపీ హయాంలో ఉన్న సమయంలోనూ యాక్టివ్ గా వ్యవహరించారు. అప్పట్లో శాప్ ఛైర్మన్ గా పని చేసారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాం లో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా లో అవినీతి చోటు చేసుకుందని .. విచారణ చేస్తామని చెప్పు కుచ్చారు. దీని పైన సిద్దార్ధ రెడ్డి ఘాటుగా స్పందించారు.

ys-jagan-fixed-key-responsibilities-for-byreddy-siddarth-reddy-appoints-new-committees

బైరెడ్డికి బాధ్యతలు
ఇక, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జిల్లాల్లో పర్యటిస్తూ.. కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. జగన్ నాయకత్వం గురించి వివరిస్తున్నారు. యువత లో బైరెడ్డికి ఉన్న పట్టు చూసిన తరువాత పార్టీ యువజన విభాగం పగ్గాలు అప్పగించాలని జగన్ డిసైడ్ అయ్యారు. 2024 ఎన్నికల వేళ కూటమి అధికారంలోకి రావటానికి నాడు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల పైన పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. దీంతో.. కూటమి ఈ హామీల అమలు విషయంలో నిర్ణయాలకు అనుగుణంగా స్పందించే బాధ్యతను బైరెడ్డికి జగన్ అప్పగించారు. అదే విధంగా మంచి వాగ్దాటి ఉండటంతో అన్ని జిల్లాల్లో పార్టీ యువజన కేడర్ తో మమేకం అవుతూ.. పార్టీ బలోపేతం దిశగా పని చేయాలని జగన్ ఇప్పటికే నిర్దేశించారు.

Take a Poll

కీలక నియామకాలు
అదే సమయంలో జగన్ మరిన్ని కీలక నియామకాలు చేసారు. రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్‌ ను నియమించారు. ఇక, పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా శెట్టిపల్లి రఘు రామిరెడ్డి, క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా రెడ్డి శాంతి, తానేటి వనిత, కైలే అనిల్‌, వై.విశ్వేశ్వరరెడ్డి నియమితులయ్యారు. వచ్చే నెల నుంచి జగన్ జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. దీనికి ముందుగానే అన్ని జిల్లాల్లో పార్టీ కమిటీల నియామకం పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. రాష్ట్ర స్థాయిలోనూ కొన్ని పదవుల్లో మార్పులు చేయనున్నారు. క్షేత్ర స్థాయిలో యాక్టివ్ గా పని చేస్తున్న నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మరో వారం రోజుల్లో కీలక నియామకాలు ప్రకటించేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+