జనం చెవిలో జగన్ పూలు.. నారా లోకేష్ విడుదల చేసిన వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రొడక్షన్స్ సమర్పించు అత్యద్భుత సినిమా అంటూ లోకేష్ విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జనాలను జగన్ ఏప్రిల్ ఫూల్ చేశాడని లోకేష్ మండిపడుతున్నారు.

విద్యుత్ ఛార్జీల విషయంలో జనాలను ఏప్రిల్ ఫూల్ చేసిన జగన్
ఏప్రిల్ 1 విడుదల అంటూ 4. 30 నిమిషాల నిడివి ఉన్న వీడియో విడుదల చేసిన లోకేష్, ఎన్నికలకు ముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన తీరును ఎండగడుతూ ఈ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో జగన్ స్వయంగా ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారో, ఏ విధంగా ప్రజలను ఇప్పుడు ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారో జగన్ మాటల్లోనే చూపించారు. ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల బాదుడే బాదుడు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని హామీ ఇచ్చారని, స్వయంగా ఆయన మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసి, ప్రస్తుతం జగన్ విద్యుత్ చార్జీలను పెంచిన తీరును ఎండగట్టారు. జనాలను ఏప్రిల్ ఫూల్ చేశారని విరుచుకుపడ్డారు.

మద్యనిషేధం విషయంలోనూ జనం చెవిలో జగన్ పూలు
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యనిషేధం చేస్తామని జగన్ ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చారని నాడు జగన్ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసిన లోకేష్ ప్రస్తుతం వైసిపి ప్రభుత్వ హయాంలో మద్యం విధానం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, కల్తీ నాటు సారా తాగి ఎంతో మంది మరణించారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో చూపించిన లోకేష్, మరోమారు జగన్ ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేశారని మండిపడ్డారు.
ప్రత్యేక హోదాపై కేంద్రానికి విజ్ఞప్తి చెయ్యటం తప్ప ఏమీ చెయ్యలేమన్న జగన్
ఇక ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి 25 ఎంపీలను గెలుచుకుంటే, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఏ విధంగా రాకుండా పోతుందో గట్టిగా చూస్తామని పేర్కొన్న జగన్, ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి పదే పదే కేంద్రాన్ని అభ్యర్ధిస్తున్నాము అని, అంతకంటే ఏమీ చేయలేకపోతున్నామని జగన్ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసి ప్రత్యేక హోదా విషయంలో కూడా ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేశారంటూ లోకేష్ వీడియో ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా చేశారు.

సన్న బియ్యం హామీ ఇచ్చి మాట తప్పిన జగన్
తాము అధికారంలోకి వస్తే ప్రజలకు సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్, ఆ తర్వాత తమ మేనిఫెస్టోలో ఎక్కడా సన్న బియ్యం ఇస్తామని ప్రకటించలేదని మాటమార్చారు అంటూ, జగన్ ఎన్నికలకు ముందు మాట్లాడిన వీడియోను, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసి ఇక బియ్యం విషయంలోనూ ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేశారు జగన్ అంటూ లోకేష్ మండిపడ్డారు.

ఏపీ రాజధాని విషయంలో జనాలను ఫూల్స్ చేసిన జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని విషయంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాజధాని ఎక్కడ పెట్టినా 30 వేల ఎకరాలు ఉండేలా చూసుకుంటే బావుంటుందని, విజయవాడ కేంద్రంగా రాజధానిని ఏర్పాటు చేయడాన్ని తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని పలికిన జగన్, అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో రాజధాని ఉండొచ్చు, విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఉండొచ్చు, కర్నూలులో హైకోర్టు ఉండొచ్చు అంటూ మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదకు తెచ్చి మాట మార్చారని, ప్రజలను మళ్లీ ఏప్రిల్ ఫూల్ చేశారని లోకేష్ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

ఉద్యోగుల సీపీఎస్ రద్దు విషయంలోనూ జగన్ ఉద్యోగుల చెవిలో పూలు పెట్టారు
ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని, ఉద్యోగులను జగన్ ఏప్రిల్ ఫూల్ చేశారని వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు లోకేష్. పేదల ముఖ్యమంత్రి అని చెప్పుకునే జగన్ నిరుపేదలకు భారం గా ఉండే విధంగా విద్యుత్ ఛార్జీలను పెంచారని ప్రజలు మండి పడుతున్నారు అని వీడియో ద్వారా తెలియజేశారు. మొత్తానికి జగన్ అధికారంలోకి రావడానికి ముందు, వచ్చిన తరువాత జనం చెవిలో పువ్వులు పెడుతూనే ఉన్నారని నారా లోకేష్ విడుదల చేసిన వీడియో ద్వారా జగన్ ను టార్గెట్ చేశారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications