పొదుపు సంఘాలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్-కెనరా బ్యాంక్ తో కీలక ఒప్పందం...
ఏపీలో పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పొదుపు సంఘాల మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు, వారు ఏర్పాటుచేసుకొనే చిన్న మద్యతరహా వ్యపారాలు లేదా పరిశ్రమలకు వ్యక్తిగతంగా రూ.10 లక్షల వరకు రుణాలు ఇవ్వడానికి కెనరా బ్యాంకు సెర్ప్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పొదుపు సంఘాల మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అందబోతున్నాయి.
రాష్ట్రంలో పొదుపు సంఘాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేందుకు కెనర బ్యాంకు కూడా ముందుకొచ్చింది. సీఎం జగన్ విజ్ఞప్తి మేరకు డ్వాక్రా సంఘాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తూ కెనరా బ్యాంకు ఇవాళ సెర్ప్ సీఈఓ ఏ.యండి.ఇంతియాజ్, కెనరా బ్యాంక్ జీఎం పి.రవివర్మతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో వడ్డీరేట్ల తగ్గింపుతో పాటు ఆయా రుణాలపై ఎలాంటి అదనపు, ప్రాసెసింగ్ , ఇన్స్పెక్షన్ అన్యువల్ రివ్యూ లేదా రెన్యువల్ చార్జీలను పూర్తిగా మినహాయింపు లభించనుంది.

ప్రస్తుతం బ్యాంకులు మహిళా సంఘాలకు ఇస్తున్న రుణాలలో రూ.5 లక్షల పైన తక్కువ వడ్డీ రేట్లలో ఉన్న బ్యాంకులు ఆప్కాబ్ 9 శాతం, కెనరా బ్యాంకు 9.7 శాతం, ఎస్బీఐ 9.7 శాతం మాత్రమే ఉన్నాయి.ఇందులో ఆప్కాబ్ తో పాటు కెనరా బ్యాంకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుండగా.. త్వరలో ఎస్బీఐ కూడా రేట్లను తగ్గించే అవకాశముంది. మహిళా సంఘాలలో ఆర్థిక అక్షరాస్యత పై ట్రైనింగ్ లతో అవగాహన పెరిగి , తక్కువ వడ్డీ రేట్లుకు రుణాలు ఇస్తున్న బ్యాంకుల వైపు మొగ్గుచూపుతున్నాయి.
రాష్ట్రంలోని పొదుపు సంఘాల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో సీఎం జగన్, సెర్ఫ్ సీఈవో ఇంతియాజ్ స్వయంగా బ్యాంకులతో మాట్లాడి వడ్డీ రేట్ల తగ్గింపుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఒక్కో బ్యాంకు పొదుపు సంఘాలకు తక్కువ వడ్డీలతో రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. మహిళల్ని పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ వడ్డీ రేట్ల తగ్గింపు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications