బద్వేల్ ఘనవిజయంపై జగన్ ఫస్ట్ రియాక్షన్- అభినందనలు, కృతజ్ఞతలు, దీవెనలతో ట్వీట్
కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధ ఘన విజయంపై సీఎం జగన్ స్పందించారు. బద్వేలు ప్రచారానికి తాను రాలేకపోతున్నానంటూ ఓటర్లకు లేఖలు రాసిన సీఎం జగన్.. ఇప్పుడు తాను వెళ్లకపోయినా వైసీపీ అభ్యర్ధికి ఘనవిజయాన్నికట్టబెట్టిన ఓటర్లను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

ముందుగా బద్వేల్ ఉపఎన్నిక పోరులో ఘన విజయం అందుకున్న వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. బద్వేలు ఉపఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రతీ అక్క చెల్లెమ్మకు, అవ్వా తాతకు, ప్రతీ ఆత్మీయ సోదరునికి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ జగన్ ట్వీట్ చేసారు. శాసనసభ్యురాలిగా గెలుపొందిన డాక్టర్ సుధమ్మకు నా అభినందనలు అని ట్వీట్ లో పేర్కొన్నారు.

Recommended Video
మరో ట్వీట్ లో సీఎం జగన్ విజయానికి గల కారణాలను కూడా వెల్లడించారు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైనందని జగన్ తెలిపారు. ఈ గెలుపు ప్రజా ప్రభుత్వానికి, సుపరిపాలనకు మీరిచ్చిన దీవెనలుగా భావిస్తూ.. మరింత మంచి చేసేందుకు కృషి చేస్తానని ఓటర్లకు సీఎం జగన్ హామీ ఇచ్చారు. బద్వేల్లో తాను ప్రచారానికి వెళ్లకున్నా వైసీపీ ఘన విజయం సాధించడం, అదీ పులివెందులలో తన మెజారిటీని మించి బద్వేల్లో డాక్టర్ సుధ మెజారిటీ అందుకోవడంతో సీఎం జగన్ ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications