జగన్‌ని దూరం పెట్టాలి: మురళీమోహన్, కొడుకుపై గల్లా

ఈ సందర్భంగా మాట్లాడారు. అవినీతి జగన్ పార్టీకి పాలించే అర్హత లేదన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కేవలం తన తనయుడిని ప్రధానిగా చేసుకునేందుకే ఆంధ్ర ప్రదేశ్‌ను విభజిస్తున్నారని ఆరోపించారు. నీతివంతమైన పాలన అందించిన చంద్రబాబు నాయుడుకు మళ్లీ పట్టం కట్టాలన్నారు.
పార్టీ మార్పుపై గల్లా అరుణ
తాను పార్టీ మారే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి గల్లా అరుణ కుమారి చిత్తూరు జిల్లాలో అన్నారు. తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామన్నారు. తన తనయుడు గల్లా జయదేవ్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను సమర్థిస్తానని ఆమె చెప్పారు.
చర్చకు అభ్యంతరం లేదు: యనమల
విభజనపై అసెంబ్లీలో చర్చకు అభ్యంతరం లేదని టిడిపి మండలి సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరగాలా లేక వద్దా అనే దానిపై అధికారికంగా తీర్మానం జరగాలన్నారు. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఎపి కాంగ్రెసు వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ కూడా తీర్మానంపై పలుమార్లు మాట మార్చారన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 189 ప్రకారం బిల్లులోని ప్రతి అంశంపైనా ఓటింగ్ నిర్వహించాల్సిందేనన్నారు.
అసెంబ్లీ అభిప్రాయం తర్వాత రాష్ట్రపతి ఆ బిల్లుపై న్యాయసమీక్ష చేసిన తర్వాతే పార్లమెంటుకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. విభజనపై తీర్మానం చేయాలి, బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు.












Click it and Unblock the Notifications