పులివెందులలో జగన్ ప్రజా దర్బార్ ! క్యాడర్ కు కీలక మెసేజ్..!
ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచి ఆ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దీనికి తోడు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వైసీపీ నేతలపై దాడులకు దిగుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ రెంటింటినీ ఎదుర్కొంటూ మరో నాలుగేళ్లు పార్టీని నడిపించాల్సిన పరిస్ధితి వైఎస్ జగన్ ది. అదే సమయంలో తాజాగా జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో వైసీపీ ఓడిపోవడం ఆ పార్టీకి మరో షాక్ గా మారింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఇవాళ పులివెందులలో పర్యటించారు.
పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించిన జగన్ వైఎస్సార్సీపీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో జగన్.. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు విన్నారు. నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు వైయస్ జగన్ వద్ద వాపోయారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు.

టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని జగన్ సూచించారు. ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క పోలీసు వ్యవస్థనే కాకుండా అన్ని వ్యవస్థలను ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని వైయస్ జగన్ మండిపడ్డారు. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలిగానీ.. కీడు చేయకూడదన్నారు.

వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, పార్టీ అని చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేశామని వైయస్ జగన్ గుర్తు చేశారు. టీడీపీ కూటమి సర్కార్ ప్రజలకు మేలు చేయడం పక్కనపెట్టి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications