మాకు తెలుసు!: స్పీకర్‌పై జగన్ ఘాటు వ్యాఖ్యలు, రోజాపై కాల్వ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ శాసన సభ సభాపతి కోడెల శివప్రసాద్‌ల మధ్య బుధవారం నాడు వాగ్వాదం జరిగింది. సభాపతిని ఉద్దేశించి జగన్ పరుష వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగం పైన ఆకాశమే హద్దుగా మాట్లాడవచ్చునని, ఏం మాట్లాడాలో సభాపతి నిర్ధేశించాల్సిన అవసరం లేదన్నారు. స్పీకర్ స్థానంలో టీడీపీ సభ్యుడిగా కూర్చున్నట్లు ఉందన్నారు. స్పీకర్ తటస్థంగా వ్యవహరించాలన్నారు.

ల్యాండ్ పూలింగ్‌ విషయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు స్పీకర్‌ అడ్డుకున్నారు. అటువంటి మాటలు అసెంబ్లీలో మాట్లాడవద్దని సూచించారు. దీంతో జగన్ కల్పించుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వ్యాఖ్యలపై కోడెల స్పందిస్తూ.. రాష్ట్రప్రయోజనాలు మాత్రమే తనకు ముఖ్యమని, ఏ పార్టీకీ అనుకూలంగా ప్రవర్తించడం లేదన్నారు.

YS Jagan hot comments in AP assembly

కాగా, అంతకుముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డ్వాక్రా రుణమాఫీ పైన చర్చకు పట్టుబట్టింది. వైసీపీ డ్వాక్రా రుణమాఫీపై వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిని స్పీకర్ తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు డ్వాక్రా రుణమాఫీపై చర్చించాల్సిందేననన్నారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది.

ఉదయం సభ ప్రారంభంకాగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు డ్వాక్రా రుణమాఫీపై చర్చకు డిమాండ్‌ చేశారు. దీనికి స్పీకర్‌ ఒప్పుకోకపోవడంతో సభ్యులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి చర్చ కోసం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓ సమయంలో కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రోజా సభను అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని అచ్చెన్నాయుడు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+