జగన్ హయాంలో ఆ అవమానాలే చంద్రబాబుకు అధికారం తెచ్చిపెట్టాయా? బాబు శపథం నెరవేరినట్టే!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఘనవిజయం సాధించింది. దేశ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదుర్కొన్న అవమానాలే చంద్రబాబుకు పట్టం కట్టాయని ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ఒకటి కాదు రెండు కాదు వైసీపీ పాలనలో చంద్రబాబు ఎదుర్కొన్న పరాభవాలు అన్నీ ఇన్నీ కాదు.

వైసీపీ పాలనలో చంద్రబాబు అవమానాలు
2014లో 151 స్థానాలతో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసిపి టిడిపి అధినేత చంద్రబాబును టిడిపి నేతలను టార్గెట్ చేసి చేసిన కక్ష సాధింపు చర్యలు ప్రస్తుతం చంద్రబాబుకు ప్రజా మద్దతును తెచ్చిపెట్టటంలో కీలక భూమిక పోషించాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంతగా గత వైసిపి పాలనలో తీవ్ర ఆవేదనకు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

YS jagan insults bring power to Chandrababu in AP CBN vow in assembly has been fulfilled

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చంద్రబాబు నాటి శపథం వీడియో
అసెంబ్లీ వేదికగా తన భార్య భువనేశ్వరి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అంటూ మళ్లీ అధికారంలోకి వచ్చేదాకా సభలో కాలు పెట్టనని శపథం చేసిన చంద్రబాబు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ప్రస్తుతం చంద్రబాబు విజయం తర్వాత నాడు నిండు సభలో చంద్రబాబు చేసిన శఫదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

చంద్రబాబును జైలుకు పంపిన జగన్
తన సతీమణి భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మీడియా ముఖంగా కన్నీటి పర్యంతమైన చంద్రబాబు వైసీపీ పాలనలో ఎదుర్కొన్న అవమానాలు అన్ని ఇన్ని కాదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుని ఇరికించి జైలు పాలు చేసిన వైసిపి, జైలులో చంద్రబాబును పెట్టిన చిత్రహింసలు, చంద్రబాబు కుటుంబాన్ని అవహేళన చేసిన విధానం ఒకటా రెండా ఐదేళ్ల వైసిపి పాలనలో చంద్రబాబు అడుగడుగునా దారుణ పరాభవాలను అవమానాలను ఎదుర్కొన్నారు.

వైసీపీ అధికారంలోకి రాకూడదని భీష్మించిన చంద్రబాబు
ఇక వాటన్నిటికీ సమాధానంగా ఏపీలో వైసీపీ అధికారంలోకి రాకూడదని భీష్మించిన చంద్రబాబు బిజెపి, జనసేన పొత్తులతో ఎన్నికలకు వెళ్లారు. ఇక ఎన్నికల పోలింగ్ నాడు జరిగిన దాడులు, పోలింగ్ తర్వాత కొనసాగిన దాడులు వెరసీ ఏపీలో ప్రజాతీర్పు టిడిపి కూటమికే అనుకూలంగా ఉందని చంద్రబాబు బలంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారు.

చంద్రబాబుకు ప్రజల సానుభూతి
చంద్రబాబు ఎదుర్కొన్న అవమానాలే ప్రస్తుతం ఆయనకు ప్రజల సానుభూతి తెచ్చిపెట్టాయని, వైసీపీ అధినేత వైఎస్ జగన్, చంద్రబాబు విషయంలో చేసిన పనులు ఆయనకు మైనస్ అయ్యాయని భావిస్తున్నారు. చంద్రబాబు అనుభవించిన అవమానాలే టిడిపి ఇంతటి ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణాలని భావిస్తున్న వారు కూడా లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+