Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైకోర్టుపై జగన్ కీలక వ్యాఖ్యలు-అసెంబ్లీని కట్టడి చేసి పరిధి దాటింది-శాసనాల్లో జోక్యం సరికాదంటూ

ఏపీలో అమరావతి రాజధానికి అనుకూలంగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇవాళ ఏపీ అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఇందులో వైసీపీ ప్రజాప్రతినిధుల తర్వాత చివరిగా మాట్లాడిన సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పు చట్ట సభల పరిధిలో జోక్యం చేసుకోవడమేనని, పరిధి దాటడమేనని గుర్తుచేశారు. ఆచరణ సాధ్యం కాదని ఆదేశాల్ని ప్రభుత్వాలకు ఇవ్వరాదన్న సుప్రీం తీర్పు ఉల్లంఘన కూడా ఉన్నారు. ఏదేమైనా మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని జగన్ తేల్చిచెప్పారు.

 హైకోర్టు తీర్పుపై జగన్ ఫైర్

హైకోర్టు తీర్పుపై జగన్ ఫైర్

రాజ్యాంగం చట్ట, న్యాయ, శాసనవ్యవస్ధల పరిధిని ఎప్పుడో చెప్పిందని సీఎం జగన్ ఇవాళ అసెంబ్లీలో తెలిపారు. ఈ మూడు వ్యవస్ధలూ ఒకరి పరిధిలోకి మరొకరు వెళ్లరాదని, అలా చేయగలిగినప్పుడే వ్యవస్ధలు ముందుకెళ్తాయని సుప్రీంకోర్టు తీర్పులు చెప్పాయన్నారు. ప్రతీ వ్యవస్ధవారి పరిధిలో వారు ఉంటేనే వ్యవస్ధలు నడుస్తాయని, అలా జరగ్గపోతే వ్యవస్ధలు కుప్పకూలిపోతాయన్నారు. కోర్టులు భవిష్యత్తులో వచ్చే చట్టాలను ఊహించి తీర్పులు చెప్పకూడదని జగన్ తెలిపారు. ఇప్పటివరకూ మేం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టలేదని, మూడు రాజధానుల కోసం చేసిన చట్టాల్ని వెనక్కి తీసుకున్నామని, అయినా హైకోర్టు ఈ తీర్పు ఎలా ఇచ్చిందని జగన్ ప్రశ్నించారు.

 హైకోర్టు డెడ్ లైన్ పై అభ్యంతరం

హైకోర్టు డెడ్ లైన్ పై అభ్యంతరం

చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్దదని, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్ధది కాదని సీఎం జగన్ తెలిపారు. ప్రజలు మంచి చట్టాలు తీసుకొస్తే అదే ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకుంటారని, ప్రజలకు మేం చేసే చట్టాలు నచ్చకపోతే వారు తమ ఓటు ద్వారా తీర్పు చెప్తారని జగన్ తెలిపారు. గత ప్రభుత్వం చేసిన చట్టాలు ప్రజలకు నచ్చనందునే మాకు 86 శాతం సీట్లు ఇచ్చి ఆ చట్టాల్ని వ్యతిరేకించారన్నారు. కోర్టులు ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదనేది దీంతో స్పష్టమవుతోందన్నారు. నెల రోజుల్లో లక్ష కోట్లు ఖర్చు చేసి మౌలిక సౌకర్యాలు కల్పించాలని, ఆరు నెలల్లోపు ఐదారు లక్షల కోట్లతో రాజధాని కట్టేయాలని అసాధ్యమైన గడువులు కోర్టులు ఎలా పెడతాయని జగన్ ప్రశ్నించారు. ఇది సరికాదని చెప్పడానికే అసెంబ్లీలో ఈ చర్చ పెట్టామన్నారు.

 పరిధి దాటిన హైకోర్టు

పరిధి దాటిన హైకోర్టు


రాష్ట్ర రాజధాని, సీఆర్డీయే చట్టానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కొన్నివిషయాలు మాట్లాడాల్సి వస్తోందని జగన్ తెలిపారు. హైకోర్టు తీర్పు రాజ్యాంగపరంగానే కాకుండా, రాష్ట్రశాసనసభకు ఉన్న అధికారాలను కూడా ప్రశ్నించేలా ఉందన్నారు. హైకోర్టు తమ పరిధి దాటిందని అనిపించిందన్నారు. రాజధాని ఎక్కడుండాలన్న నిర్ణయంతో పాటు రాజధానిపై అసెంబ్లీకి ఎలాంటి అధికారం లేదని కోర్టు తీర్పు ఇచ్చిందని, విభజన చట్టం ప్రకారం ఈ అధికారాలు కేంద్రం పరిధిలోనే ఉంటాయని, అసెంబ్లీకి సంబంధం లేదని చెప్పిందని జగన్ తెలిపారు. పాలన వికేంద్రీకరణకు కేంద్రం అనుమతి తీసుకోవడం తప్ప ప్రభుత్వం చేయగలిందేమీ లేదని కూడా చెప్పిందన్నారు.
హైకోర్టు తీర్పు దేశ సమాఖ్య స్ఫూర్తికి, శాసనసభ అధికారాలకు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు.అసెంబ్లీ అధికారాల్ని హరించేలా ఉందన్నారు.

 కేంద్రం వైఖరినీ పట్టించుకోరా ?

కేంద్రం వైఖరినీ పట్టించుకోరా ?

రాజ్యాంగం ప్రకారం చూసినా రాజధాని నిర్ణయంలో కేంద్రం పాత్ర ఉండదని జగన్ తెలిపారు. కేంద్రం తనకు ఆ అధికారం ఉందని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఏ కోర్టులోనూ కేంద్రం అలా వాదించలేదు కూడా అన్నారు. ఇది సంపూర్ణంగా రాష్ట ప్రభుత్వ అధికారమేనంటూ హైకోర్టులో కేంద్రం చెప్పిందన్నారు. పార్లమెంటులోనూ కేంద్రం రాతపూర్వకంగా కూడా ఇదే చెప్పిందని జగన్ గుర్తుచేశారు. హైకోర్టు ఉంది కాబట్టి అక్కడే రాజధాని ఉండాలని చట్టంలో లేదని కూడా కేంద్రం అదనపు అఫిడవిట్ లో చెప్పిందన్నారు. కేంద్రం మాకు రాజధానులపై అధికారం ఉందని చెప్తున్నా, హైకోర్టు మాత్రం లేదనడం ఎంతవరకూ సమంజసమని జగన్ ప్రశ్నించారు.

 సభలో చర్చ ఎందుకు పెట్టామంటే ?

సభలో చర్చ ఎందుకు పెట్టామంటే ?

హైకోర్టు అధికారాల్ని అగౌరవపర్చడానికి సభలో ఈ చర్చ పెట్టలేదని, హైకోర్టుపై మాకు ఎంతో గౌరవమని జగన్ తెలిపారు.. అదే సమయంలో రాష్ట్ర అసెంబ్లీకి ఉన్న గౌరవాన్ని, అధికారాల్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత శాసన వ్యవస్ధపై ఉందన్నారు. ఎందుకంటే ఇది మనతో ఆగిపోయేది కాదని, భవిష్యత్తులోనూ చట్టసభలుంటాయన్నారు. ఇవాళ ఈ సభలో ఈ చర్చ పెట్టకపోతే చట్టాలు చేసే అధికారం కోర్టులదా , అసెంబ్లీదా అనే చర్చ అలాగే ఉండిపోతుందన్నారు. అసెంబ్లీకి రాజధాని వికేంద్రీకరణపై తీర్మానం కూడా చేసే అధికారం లేదని కూడా హైకోర్టు చెబుతోందని, గౌరవ న్యాయస్ధానం తన పరిధిని దాటి వ్యవస్ధలో కీలకమైన శాసన వ్యవహారాల్లోకి ప్రవేశించడం, సంఘర్షణే అని అనిపిస్తోందన్నారు. రాజధానితో పాటు ఈ ప్రాంతంలో నిర్మాణాలు అన్నింటినీ, నెలరోజుల్లో మౌలిక సౌకర్యాలు, ఆరునెలల్లో మిగతా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చిందని,. అది సాధ్యమేనా అని అనిపిస్తోందని జగన్ తెలిపారు.

 సుప్రీం తీర్పులకూ విరుద్ధం

సుప్రీం తీర్పులకూ విరుద్ధం

ఆచరణకు సాధ్యం కాని ఆదేశాల్ని హైకోర్టులు రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేయరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా హైకోర్టు తీర్పు విరుద్ధంగా ఉందని జగన్ తెలిపారు. అమరావతిలో మాస్టర్ ప్లాన్ గ్రాఫిక్స్ రూపంలోనే ఉందని, మాస్టర్ ప్లాన్ గడువు 20 ఏళ్లు కాగా.. ప్రతీ ఐదేళ్లకోసారి దాన్ని సమీక్షించాలని కూడా చెప్పారన్నారు.. అయినా ఈ 20 ఏళ్లు కూడా అసాధ్యమని అందరికీ తెలుసన్నారు. ఇప్పటికి ఆరేళ్లు గడిచిపోయాయి. ఆరేళ్ల క్రితం తయారై ఇప్పటివరకూ గ్రాఫిక్స్ పైనే ఉన్న ఈ మాస్టర్ ప్లాన్.. కనీస మౌలిక సదుపాయాల కోసమే 54 వేల ఎకరాలకు ఎకరానికి 2 లక్షల చొప్పన లక్ష కోట్లకు పైగా అంచనా వేశారు. ఇది ఇప్పటికి పెరిగి ఉంటుంది కూడా. పెరుగుతున్న ధరల ప్రకారం రాజధాని అభివృద్ధికి 40 ఏళ్లు పడుతుంది. హైదరాబాద్ తో పాటు ఏ రాజధాని చూసినా అభివృద్ధికి దశాబ్దాలు, శతాబ్దాలు పట్టిందన్నారు. చంద్రబాబు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదని, తాను ఇల్లు కట్టుకున్నానని జగన్ గుర్తుచేసారు. అమరావతిపై తనకు ప్రేమ ఉన్నందునే ఇక్కడ శాసన రాజధాని కొనసాగిస్తున్నట్లు జగన్ తెలిపారు. మౌలిక సౌకర్యాల కోసమే లక్ష కోట్లు ఖర్చయ్యే అమరావతి అభివృద్ధికి 40 ఏళ్లు పడుతుందని భావిస్తున్నానన్నారు. ఈ గడువు ముగిసేసరికి లక్ష కోట్లు కాస్తా 25 లక్షల కోట్లు అవుతుందన్నారు. ఏదో భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవడం కాదని, వాస్తవ పరిస్ధితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. చంద్రబాబుకు నిజంగా రాజధాని పెట్టాలని ఉంటే విజయవాడలోనో, గుంటూరులోనో రాజధాని పెట్టేవారన్నారు. కానీ ఈ రెండింటికీ దూరంగా 40 కిలోమీటర్లదూరంలో అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారన్నారు.

 ఇదే ఫైనల్.. తేల్చిసిన జగన్

ఇదే ఫైనల్.. తేల్చిసిన జగన్

29 గ్రామాలు,54 వేల ఎకరాలే కాదు రాష్ట్రంలో ఉన్న మిగతా 99 శాతం ప్రాంతాల్లో సంక్షేమం, అభివృద్ధి కూడా అవసరమే. ఆ బాధ్యత మర్చిపోకూడదని జగన్ తెలిపారు. సాధ్యం కానివి సాధ్యం చేయాలని ఏ వ్యవస్ధ కూడా నిర్దేశించలేదన్నారు.. అందుకే వీటన్నింటిపై న్యాయసలహా తీసుకుంటున్నామన్నారు.. ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను కొలిక్కి తీసుకురాడంతో పాటు రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతుల ప్రయోజనాలూ కాపాడతామని జగన్ హామీ ఇచ్చారు. వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోమన్నారు. ఎందుకంటే వికేంద్రీకరణకు అర్ధం అన్నిప్రాంతాల అభివృద్ధి కాబట్టి, అందరి ఆత్మగౌరవం అందులో ఉంది కాబట్టి,అడ్డంకులు ఎదురైనా అదే సరైన మార్గం కాబట్టి, అందరికీ మంచి చేసేందుకు తమ ప్రభుత్వం ఉందని జగన్ తెలిపారు. ఈ చట్టసభకు రాబోయే తరాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అని వెల్లడించారు. వికేంద్రీకరణ తప్ప మరో మార్గం లేదని సవినయంగా తెలియజేస్తూ న్యాయవ్యవస్ధపై అచంచలవిశ్వాసం ప్రకటిస్తూ, వికేంద్రీకరణ మా హక్కు, రాజధానిపై నిర్ణయం మా హక్కు అని తెలియచేస్తున్నానని జగన్ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+