అందుకే మనం ఓడిపోయాం, అయినా - జగన్ సంచలనం..!!
ఎన్నికల ఫలితాల పై మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను రాజకీయాల్లో విలువలు..విశ్వసనీయతకే కట్టుబడి ఉంటానని స్పష్టం చేసారు. పార్టీ ప్రజా ప్రతినిధులందరిదీ అదే బాట అని స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఏకాభిప్రాయంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేసినట్ల వైయస్ జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబును ఈ ఎన్నిక ల్లో ఎదుర్కొనే సత్తా ఉందనే బొత్సాను అభ్యర్దిగా ఖరారు చేసామని చెప్పుకొచ్చారు.
జగన్ వ్యాఖ్యలతో
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పాటు నైతిక విలువులు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదని జగన్ వ్యాఖ్యానించారు. 600కు పైగా స్థానాల్లో మనం గెలిస్తే.. టీడీపీ వాళ్లు కేవలం 200కు పైగా స్థానాల్లోనే గెల్చారని వివరించారు. వారికి, మనకు దాదాపుగా 387 స్ధానాల తేడా ఉందని చెప్పుకొచ్చారు. గెలిచిన వాళ్లు అంతా మన పార్టీ గుర్తు, జెండా మీద గెలిచారన్నారు. అలాంటి పరిస్థితుల్లో మెజారిటీ లేనప్పుడు ఎవరైనా పోటీ పెట్టకూడదని పేర్కొన్నారు.

తొలి నుంచి ఇలాగే
జగనే ఈరోజు ముఖ్యమంత్రి స్ధానంలో ఉండి ఉంటే.. వాళ్లకు అక్కడ మెజారిటీ ఉండి ఉంటే, మనం పోటీ కూడా పెట్టి ఉండేవాళ్లం కాదని చెప్పారు. మన పార్టీ తరపున గెలిచిన వాళ్లకు ఫోన్లు చేసి ప్రలోభ పెడుతున్నాని చెప్పారు. మనుషులను పంపించిన మరీ మీకు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారని వివరించారు. తనజీవితంలో విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయమే చేశాననని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నేను, అమ్మ తప్ప ఎవరూ లేరు. మా ఇద్దరమే బయటకు వచ్చామని గుర్తు చేసుకున్నారు.

అందుకే ఓడిపోయాం
కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాం. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామని అడిగితే.. నాతో పాటు రావాలంటే రాజీనామా చేసి రావాలని చెప్పానని వెల్లడించారు. 2014 ఎన్నికల్లో మనం ఓడిపోయా మని గుర్తు చేసుకున్నారు.చేయలేనిది, జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడడన్నారు. అబద్దం చెప్పనందుకు ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నామని వివరించారు. మొన్న ఎన్నికల్లో ఒ 10 శాతం ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మారన్నారు. ఈ మోసపు ప్రచారంతో ఓ పది శాతం ప్రజలు మన దగ్గర నుంచి దూరమయ్యారని జగన్ చెప్పుకొచ్చారు. జగన్ పలావ్ పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతామన్నాడు. చంద్రబాబుని నమ్మి ఓటేశారు. పలావ్ పోయింది. బిర్యానీ పోయింది. చివరకు పస్తు పడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిని జగన్ విశ్లేషించారు.
-
YS Jagan: బెంగళూరు నుంచి మకాం మార్చబోతున్న జగన్ ? కూటమికి కౌంటర్ ప్లాన్..! -
జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్ కలకలం-హైకోర్టుకు వైసీపీ-డీజీపీకి ఘాటు లేఖ..! -
డీ లిమిటేషన్ వేళ రూటు మార్చిన జగన్ - ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు...!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!!












Click it and Unblock the Notifications