Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ ఆపరేషన్ షురూ, రహస్య మంత్రాంగం - గురి కుదిరేనా..!!

మాజీ సీఎం జగన్ రూటు మార్చారు. రాజకీయంగా.. కుటుంబ పరంగా ముప్పేట సమస్యలు ఎదుర్కొంటున్న జగన్ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా మంత్రాంగం నడిపిన జగన్ ఇప్పుడు పులివెందులలో కీలక అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ సంబంధాలను ఇప్పుడు వినియోగించుకుంటున్నారు. రాజకీయంగా పోరాటానికి సిద్దం అవుతూనే షర్మిల వివాదం కు ముగింపు పలికేలా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల వేళ జగన్ తాజా మంత్రాంగం ఆసక్తి కరంగా మారుతోంది.

రూటు మార్చిన జగన్
జగన్ ఎన్నికల్లో ఓడిన తరువాత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా సోదరి షర్మిల తో ఆస్తుల వివాదం .. తల్లి విజయమ్మ లేఖతో జగన్ ఒక విధంగా ఆత్మరక్షణలో పడ్డారు. ఇదే సమయంలో గతం కంటే భిన్నంగా కుటుంబ సభ్యుల ఆరోపణలను కౌంటర్ చేస్తున్నారు. జమిలి ఎన్నికల ప్రచారం వేళ రాజకీయంగా తిరిగి బలం పెరగాలంటే ప్రధానంగా ఇంటి సమస్యలను పరిష్కారం చేసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే తాజాగా పులివెందులలో వైఎస్ కుటుంబ సభ్యులు.. బంధువులతో జగన్ వరుసగా మంతనాలు సాగించారు.

YS Jagan key discussions with Family members amid Disputes with Sharmila

కుటుంబ సభ్యులతో
బెంగళూరు కేంద్రంగా రాజకీయ వ్యవహారాల పై చర్చలు చేస్తున్న జగన్ తాజాగా పులివెందుల లో బంధువుల నివాసాలకు వెళ్లారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వారి ఇళ్లకు వెళ్లటం చర్చగా మారింది. తన క్యాంపు కార్యాలయంలో ఎంపీ అవినాష్ , మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, మనోహర్ రెడ్డి మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో చాలా సేపు చర్చలు జరిపారు. షర్మిల తో వివాదం పైనే ఈ చర్చలు జరిగాయని భావిస్తున్నారు. ఆ తరువాత పెదనాన్న ప్రకాశ్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆక్కడ ఏకాంతంగా ఆయనతో చర్చలు జరిపారు. విజయమ్మతో ప్రస్తుత వివాదం పై రాయబారం జరిపే అంశం పైన ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. అదే విధంగా మరో ఇద్దరు నివాసాలకు జగన్ వెళ్లటంతో జగన్ ఈ వివాదానికి ముగింపు పలకాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

తాజా మంత్రాంగంతో
తాజాగా ఢిల్లీలో కీలక నేతలతోనూ జగన్ తాజాగా మాట్లాడినట్లు సమాచారం. సోదరి షర్మిల, తల్లి విజయమ్మ తన రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రం అందిస్తున్నారని జగన్ భావిస్తున్నారు. దీంతో, ముందుగా ఈ ఆస్తులు.. విభేదాలకు ముగింపు పలకే విధంగా కుటుంబంలోని పెద్దలతో చర్చలు చేస్తున్నారని సమాచారం. అదే విధంగా జనవరి నుంచి పూర్తిగా ప్రజల్లోనే ఉండే విధంగా జగన్ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ లోగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో పార్టీ నియామకాలు పూర్తి చేయనున్నారు. ప్రతీ జిల్లాలోనూ జగన్ పర్యటన ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, జగన్ ప్రస్తుతం చేస్తున్న మంత్రాంగం ఎంత వరకు ఫలిస్తుందనేది తేలాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+