భారత్-పాక్‌లా అవుతుంది: కేసీఆర్‌కు జగన్ హెచ్చరిక, 'బాబు'కు విరామం
కర్నూలు: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్మిస్తున్న పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పైన వైసిపి అధినేత జగన్ సోమవారం మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన జల వివాదాలు ముదిరితే భారత్ - పాక్ అవుతుందని హెచ్చరించారు.
కేసీఆర్ నీటి విషయంలో అడ్డగోలు అబద్దాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా అక్రమ ప్రాజెక్టులు కడుతోందని, అయినా మన ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులతో కింద ఉన్న మన ప్రాంతం ఏడారి అవుతుందని చెప్పారు.
కర్నాటక, తమిళనాడు ప్రాంతాలు ఇప్పటికే కిందకు నీరు రాకుండా చేస్తున్నాయని, ఇప్పుడు ఏకంగా పాలమూరు ప్రాజెక్టుతో నీటిని పైకి తీసుకుపోతే కింద ఉన్న శ్రీశైలంకు నీరు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నను తాను కేసీఆర్‌ను, చంద్రబాబును అడుగుతున్నానని చెప్పారు.
కల్వకుర్తి ఇంతకుముందు 25 టీఎంసీలు ఉంటే ఇప్పుడు దానిని 40 టీఎంసీలకు పెంచారని మండిపడ్డారు. డిండి ప్రాజెక్టుతో రెండు టీఎంసీలు తీసుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారన్నారు. పాలమూరు - రంగారెడ్డి, డిండి ద్వారా రెండు టీఎంసీల నీటిని అటు నుంచి అటే పైకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఇది ధర్మమేనా అని తాను కేసీఆర్, చంద్రబాబులను అడుగుతున్నానని చెప్పారు. కేసీఆర్ ప్రాజెక్టులతో నీటిని ఎడాపెడా పైకి తీసుకుపోతే మాకు కనీసం తాగడానికి అయినా నీరు దొరుగుతుందా అని ప్రశ్నించారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, రాయలసీమ జిల్లాలకు నీరు రాదన్నారు.
చివరకు తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలకు కూడా ఈ ప్రాజెక్టుల వల్ల కేసీఆర్ అన్యాయం చేస్తున్నారన్నారు. అయినా చంద్రబాబు దీనిని ప్రశ్నించక పోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల వల్ల ఏపీ ఏడారిగా మారుతుందన్నారు.
విభజన బిల్లులో పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు లేదని చెప్పారు. కెసిఆర్ తనకు ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కడుతుంటే అడిగే నాథుడు కరువయ్యాడని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. ఇష్టారీతిన ప్రాజెక్టులు కట్టడం సరికాదన్నారు. అనుమతుల్లేకుండా ప్రాజెక్టులు ఎలా కడతారని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
కేసీఆర్ అడ్డగోలుగా అబద్దాలు ఆడుతున్నారన్నారు. ఈ ప్రాజెక్టుల పైన తాను కేసీఆర్‌ను గట్టిగా అడుగుతున్నానని, అలాగే ఆయను నిలదీయకుండా ఉంటున్న చంద్రబాబును కూడా గట్టిగా అడుగుతున్నానని జగన్ వ్యాఖ్యానించారు.
ఏపీకి రెండే నదులు ఆధారమని, ఒకటి గోదావరి, రెండు కృష్ణా నది అన్నారు. ఆ ప్రాజెక్టుల పైన కేసీఆర్ ఇష్టారీతిన ప్రాజెక్టులు కడితే ఏపీకి నష్టమే అన్నారు. గోదావరి, కృష్ణా నదిల పైన కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.

గోదావరి, కృష్ణా నదుల పైన కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కడుతున్నా అడిగే వారు లేకపోవడం తనను బాధిస్తోందన్నారు. గతంలో మహారాష్ట్ర, కర్నాటకలు అక్రమ ప్రాజెక్టులు కడితే.. తెలుగు వారమంతా కలిసి పోరాడేవాళ్లమన్నారు.
ఈ రోజు తెలుగు రాష్ట్రాలు రెండు అయ్యాక.. ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యాక.. మన మధ్యే గొడవలు అని అభిప్రాయపడ్డారు. విభజన సమయంలో కేసీఆర్ అనవసరంగా గొడవలు చేసి హైదరాబాదును తీసుకున్నారన్నారు. ఇప్పుడు నీళ్లు కూడా దోచుకుంటున్నారన్నారు.
ఇలా కేసీఆర్ చేసేది మంచి పనేనా అని ప్రశ్నించారు. కింది రాష్ట్రాలకు నీరు ఇవ్వకుంటే కేసీఆర్‌కు పాపం అంటుతుందన్నారు. కర్నాటక, మహారాష్ట్రాల వలే కెసిఆర్ కూడా కిందనున్న ఏపీ తెలుగు వారికి నీరు ఇవ్వకుంటా ఉండటం సరికాదన్నారు.
తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల పైన అందరం ఒక్కటి కావాలన్నారు. పై రాష్ట్రాలు వారి వాటాలు వారు తీసుకోవాలని, కింద వారి వాటా కిందకు ఇవ్వాలన్నారు. కానీ పై రాష్ట్రాలు ఇష్టారీతీన నీటిని వాడుకుంటే కింద రాష్ట్రాలకు ఇబ్బంది కాదా అని ప్రశ్నించారు.
ఇలాగే అయితే భారత్ - పాకిస్తాన్ కాదా అన్నారు. కేసీఆర్ అడ్డగోలు మాటలు మాట్లాడుతుంటారని మండిపడ్డారు. నీటి విషయంలో కేసీఆర్ అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓ ప్రాజెక్టులోని 1480 టీఎంసీల వాటాలో తెలంగాణకు 950, ఏపీకి 540 మాత్రమేనని చెప్పడం ఎంత వరకు సమంజసమన్నారు.
ఎవడబ్బ సొత్తు అని ఇష్టారీతిన నీటిని తీసుకుంటావన్నారు. కేసీఆర్ హిట్లర్ మాదిరిలా ప్రవర్తించడం సరికాదన్నారు. కేసీఆర్ అప్రజాస్వామిక వైఖరి జాతీయ నాయకులకు, దేశానికి తెలియాలన్నారు. అలాగే నిలదీయలేని చంద్రబాబు తీరు కూడా అందరికీ తెలియాలన్నారు.
కేసీఆర్ ఇలాగే వ్యవహరిస్తే పాక్-భారత్‌లా మారుతాయన్నారు. మేం (ఏపీ) పైన ఉంటే, మీకు నీటిని ఇలాగే ఇచ్చేవారం కాదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీకి నీటిని ఇవ్వాలన్నారు. మేం పైన ఉంటే అలా చేసి ఉండేవారం కాదన్నారు. కాగా, జగన్ తన ప్రసంగంలో కేసీఆర్‌ను దుయ్యబట్టినప్పటికీ చంద్రబాబు పేర్లు కొన్నిసార్లు ప్రస్తావించారు. అయితే, గతంలో కంటే భిన్నంగా 'బాబు'కు కొంచెం ఊరటనిచ్చారు.
-
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
పేటీఎం బ్యాచ్‌తో నెగిటివ్ రివ్యూలా? వైసీపీకి యాక్టర్ శివాజీ వార్నింగ్ -
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications