వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీపై లాస్ట్ పంచ్ రెడీ చేసిన జగన్ ! చంద్రబాబు ఉదాహరణతో ! నాలుగేళ్ల విమర్శలకు చెక్ ?

ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ నాలుగేళ్లుగా అందులో విఫలం కావడంతో ఎదురవుతున్న విమర్శలను అధిగమించేందుకు పార్లమెంట్ లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టబోతోంది.

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వైఎస్ జగన్ పలు హామీలిచ్చారు. అయితే వాటిలో సంక్షేమానికి సంబంధించిన హామీలు దాదాపుగా అమలుచేసినప్పటికీ రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం ఇచ్చిన హామీలు అమలుచేయించడంలో మాత్రం విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వీటిని అడ్డుపెట్టి జగన్ ను టార్గెట్ చేసేందుకు విపక్షాలు సిద్దమవుతున్నాయి. దీన్ని గ్రహించిన జగన్.. ఇప్పుడు పార్లమెంటు వేదికగా కొత్త వ్యూహం అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు.

మోడీపై జగన్ లాస్ట్ పంచ్ ?

మోడీపై జగన్ లాస్ట్ పంచ్ ?

ఏపీలో నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించే ప్రయత్నంలో బీజేపీకి దగ్గరైంది. బీజేపీ అడిగినా అడకగపోయినా పలు సందర్భాల్లో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు అండగా నిలుస్తోంది. దీంతో రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యల్ని జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ప్రస్తావిస్తున్నా ప్రధాని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదే పరిస్దితి కొనసాగితే రాబోయే రోజుల్లో వైసీపీకి సమస్యలు తప్పేలా లేవు. దీంతో వైఎస్ జగన్ ప్రధాని మోడీపై ఈసారి లాస్ట్ పంచ్ విసిరేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రత్యేక హోదాపై ప్రైవేటు బిల్లుకు రెడీ

ప్రత్యేక హోదాపై ప్రైవేటు బిల్లుకు రెడీ


ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం ఎప్పుడో చేతులెత్తేసింది. అయినా ప్రజలకు వైసీపీ ఇచ్చిన హామీ మాత్రం అలాగే ఉంది. దీన్ని ఎన్నికలకు ముందు లేవనెత్తేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ద్వారా ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటులో చర్చకు తీసుకురావాలని వైసీపీ నిర్ణయించింది.
ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు కోసం పార్లమెంటులో ప్రైవేటు మెంబరు బిల్లు ప్రవేశ పెడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తలారి రంగయ్య, పిల్లి సుబాష్‌ చంద్రబోస్‌, ఎన్‌.రెడ్డప్ప ఇవాళ ప్రకటించారు. ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం కాదని, పవిత్రమైన పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ అని ఎంపీలు గుర్తు చేశారు. విభజన హామీలు సాధించుకోవడం కోసం పార్లమెంటులో గళమెత్తుతామని తెలిపారు.

 హోదాతో పాటు వీటిపైనా ప్రైవేటు బిల్లు

హోదాతో పాటు వీటిపైనా ప్రైవేటు బిల్లు

ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలపై ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రైవేశపెట్టేందుకు వైసీపీ సిద్ధమవుతోంది.
ఇందులో అనంతపురం సెంట్రల్‌ యూనివర్సిటీకి నిధులు, మెడికల్ కాలేజీలకు అనుమతులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాజధానికి నిధులు, నదుల అనుసంధానం, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం, రెవెన్యూ లోటు భర్తీ, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటిని విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా ఇంకా అమలుచేయని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రైవేటు మెంబర్ బిల్లు ద్వారా ముందుకొస్తామని వైసీపీ ఎంపీలు ఇవాళ ప్రకటించారు.

 మోడీకి చంద్రబాబు పరిస్ధితే ?

మోడీకి చంద్రబాబు పరిస్ధితే ?


పవిత్ర దేవాలయం లాంటి పార్లమెంటులో ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమైతే ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగే ప్రమాదం ఉందని ప్రధాని గమనించాలని వైసీపీ ఎంపీలు ఇవాళ సూచించారు. ఒక ప్రభుత్వం పార్లమెంటులో ఒక హామీ ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉంటుందని,
ఇప్పటికే రాజకీయ పార్టీలపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతోందని వారు తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన 600కు పైగా హామీల్లో 10 శాతం కూడా అమలు చేయలేదని, ఇలాంటి రాజకీయ పార్టీలపై ప్రజల్లో ఎందుకు విశ్వాసం ఉంటుందని ప్రశ్నించారు. ఒక హామీ ఇచ్చామంటే ఖచ్చితంగా అమలు చేయాలని మా నాయకుడు వైఎస్‌ జగన్‌ చెప్పారని, మొదటి రోజు నుంచే వాటి అమలుకు ఆయన కృషి చేశారని గుర్తుచేస్తున్నారు. అలానే ప్రత్యేక హోదాపై ఎవరు హమీ ఇచ్చారు అనేది పక్కన పెట్టి, కేంద్ర ప్రభుత్వంగా హామీ ఇచ్చిందని గుర్తించాలన్నారు.

English summary
ysrcp has planned a new strategy to put pressure on pm modi for special category status to ap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X