ఫలితాల పై తేల్చేసిన జగన్ - సీన్ అర్దమైపోయింది..!!
ఏపీలో పోలింగ్ సమరం ముసిగింది. భారీ పోలింగ్ నమోదలైంది. రాష్ట్ర చరిత్రలో తొలి సారిగా 81.86 శాతం పోలింగ్ రికార్డు అయింది. పోలింగ్ వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన సమరం పోలింగ్ సరళి చూసిన తరువాత మరింత ఉత్కంఠ పెంచింది. ఓటు వేయటం కోసం ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలి వచ్చారు. దీంతో కూటమికి అనుకూలమనే ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో పోలింగ్ సరళి పైన సమీక్షించిన జగన్ ఫలితం పై స్పష్టతకు వచ్చారు.
భారీ అంచనాలు
ఏపీలో పోలింగ్ ముగిసింది. ప్రచారం నుంచి ఓటింగ్ వరకు ఎవరి సత్తా ఏంటో చాటుకొనే ప్రయత్నం చేసారు. పోలింగ్ సరళి పైన అటు కూటమి..ఇటు వైసీపీ ముఖ్యులకు తొలి రోజు అంచనాలు అంతు చిక్కలేదు. ఒక వైపు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ఓటర్లు...ప్రభుత్వం పైన వ్యతిరేకత..పెరుగుతున్న పోలింగ్ శాతం వంటి అంశాలు పూర్తిగా తమకే అనుకూలిస్తాయని కూటమి అంచనా వేసింది. భారీ మెజార్టీ ఖాయమనే లెక్కలు వేసింది. అదే సమయంలో ఉదయం నుంచే మహిళా ఓట్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి కనిపించారు. ఉదయం సమయంలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా కనిపించింది. దీంతో..వైసీపీలో ఆశలు పెరిగాయి.

ఎవరి మద్దతెవరికి
గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగటం తో కూటమి లెక్కలు వేసింది. పోలింగ్ శాతం పెరగటం అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నట్లేనని విశ్లేషణలు వచ్చాయి. అటు వైసీపీ తమ పథకాలతో పూర్తి పాజిటివ్ ఓటింగ్ మహిళల నుంచి తమకు దక్కిందని అంచనా వేసింది. దాదాపు 1500 పోలింగ్ కేంద్రాల్లో అర్ద్రరాత్రి దాటే వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల సంఘం అధికారికంగా లెక్కలు వెల్లడించింది. అయితే, అనూహ్యంగా ఏపీలో ప్రధాన నగరాలుగా ఉన్న విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి ముఖ్య కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోల్చుకుంటే పోలింగ్ శాతం తగ్గింది. నియోజకవర్గాల వారీగా దాదాపు 143 నియోజకవర్గాల్లో పురషుల కంటే మహిళల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి.

ధీమాగా సీఎం జగన్
ఇక..సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలు, ఐ ప్యాక్ సంస్థ ముఖ్యులతో పోలింగ్ సరళి పైన సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా నివేదికలతో విశ్లేషించారు. కోటి 69 లక్షల మంది మహిళలు ఓటింగ్ లో పాల్గొన్నారు. కోటి 64 లక్షల మంది పురుషులు ఓట్లు వేైసారు. తమ పథకాల లబ్దిదారులు మహిళలే కావటంతో మహిళల పాజిటివ్ ఓటింగ్ తమకు కలిసి వస్తుందని తేల్చారు. అదే విధంగా టీడీపీ కంచుకోటలుగా భావిస్తున్న నియోజకవర్గాల్లో సైతం మహిళా ఓటింగ్ ఎక్కువగా ఉండటంతో ఫలితాలు అనుకూలంగా ఉంటాయనే అంచనాకు వచ్చారు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో మాత్రం కొంత వెనుకబడినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో..జగన్ తన ట్వీట్ ద్వారా ఇప్పటి వరకు సాగిన పాలన మరింత మెరుగ్గా సాగుతుందని హామీ ఇచ్చారు. కానీ, ఎవరి అంచనాలు నిజమవుతాయనేది ఇప్పుడు మరింత ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications