వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: సీమాంధ్రలో జగన్ హవా, తెలంగాణలో పోటాపోటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దాదాపు అన్ని సర్వేలలోను... సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ క్రమంగా పుంజుకుంటోందని, ఆ కూటమి ఎక్కువ లోకసభ స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఓ సర్వేలో వైయస్సార్ కాంగ్రెసు హవా ఉందని వెల్లడైంది.

అగస్త్య రీసెర్చ్ అండ్ అనలైసిస్ అజెన్సీ (ఆరా) అనే సంస్థ సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో సర్వే చేసింది. సర్వే ప్రకారం.... సీమాంధ్రలో వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 105 నుండి 112 లోకసభ స్థానాలను గెలుచుకుంటుంది.

YS Jagan to lead in AP, says survey

అలాగే 15 నుండి 18 లోకసభ సీట్లలో విజయదుందుబి మోగిస్తుంది. సీమాంధ్రలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏదైనా పార్టీ అధికారంలోకి రావాలంటే 88 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. జగన్ పార్టీ ఆ మార్క్‌ను దాడి మరో ఇరవై సీట్లకు పైగా గెలుచుకోనుంది. టిడిపి-బిజెపి కూటమి 55-65 స్థానాలు గెలుచుకోనుంది. ఏడు నుండి పది లోకసభ స్థానాలు గెలుచుకుంటుంది. ఇక కాంగ్రెసు పార్టీ 10-15 అసెంబ్లీ స్థానాలు, 1 లోకసభ స్థానాన్ని గెలుచుకుంటుంది. కాగా, స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం గెలు పోటములపై ప్రభావం ఉండనుంది.

తెలంగాణ ప్రాంతంలో...

తెలంగాణ విషయానికి వస్తే... 119 స్థానాలకు గాను తెలంగాణ రాష్ట్ర సమితి 52 - 57 స్థానాలు, 7-9 లోకసభ స్థానాలు గెలుచుకుంటుంది. కాంగ్రెసు-సిపిఐ కూటమి 43-45 అసెంబ్లీ స్థానాలు, 4-6 లోకసభ స్థానాలు, టిడిపి-బిజెపి కూటమి 12-15 అసెంబ్లీ స్థానాలు, 2- లోకసభ స్థానాలు గెలుచుకుంటుంది. మజ్లిస్ పార్టీ ఆరు నుండి 7 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుంది. తెలంగాణలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే 60 స్థానాల్లో గెలవాల్సి ఉంది. కానీ, తెరాస గాని, కాంగ్రెసు గానీ ఆ సంఖ్యను చేరుకోలేకపోతుందట.

English summary
A pre-poll survey conducted by Aaraa, a city-based agency, has predicted that the YSR Congress could get between 105 and 112 Assembly seats and 15 to 18 Lok Sabha seats in Seemandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X