జగన్ బహిరంగ సభలో ఇది జరిగింది, తలలు పట్టుకున్న వైసీపీ లీడర్స్, క్లారిటీ అయితే లేదు !
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నాయకులు బిజీగా ఉన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని సీఎం జగన్ ఇప్పటికే బస్సు యాత్ర మొదలుపెట్టారు. అయితే సీఎం జగన్ స్వయంగా వచ్చినా మా ప్రాంతంలోని సమస్యల గురించి, జిల్లా కేంద్రం విషయంలో క్లారిటీ ఇవ్వలేదని వైసీపీలోని కొందరు నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది.
మంగళవారం అనంతపురం జిల్లాలోని తనకల్లు నుంచి అన్నమయ్య జిల్లాలోకి సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర ఎంట్రీ ఇవ్వడంతో ఆ ప్రాంతంలోని వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చింది. సీఎం జగన్ మా ప్రాంతానికి వస్తున్నారని, మా ప్రాంతానికి న్యాయం జరుగుతుందని ప్రజలు అనుకున్నారు. ఇంత కాలం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మనపైన చేస్తున్న ఆరోపణలకు సీఎం వైఎస్ జగన్ ఇదే బహిరంగ సభలో చెక్ పెడుతారని వైసీపీ నాయకులు అనుకున్నారు.

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో వైసీపీ బారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అప్పటికే మొలకలచెరువు, అంగళ్లు ప్రాంతంలోని ప్రజలను వైఎస్ జగన్ పలకరించారు. అంగళ్లు శివార్లో భోజనం విరామం తరువాత కొంత సేపు విశ్రాంతి తీసుకున్న వైఎస్ జగన్ సాయంత్రం మదనపల్లెలోని టిప్పుసుల్తాన్ మైదానంలో జరిగిన వైసీపీ బహిరంగ సభకు చేరుకున్నారు. మదనపల్లెతో పాటు చుట్టు పక్కల ఉన్న 7 నియోజక వర్గాల వైసీపీ అభ్యర్థులు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ఇదే వేదిక మీదకు వచ్చారు.
మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించలేదని కొంతకాలం నుంచి ఆ ప్రాంతంలోని ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి పేరును ప్రకటించిన తరువాత కొన్ని నెలల పాటు మదనపల్లెలో ధర్నాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలతో దద్దరిల్లింది. మదనపల్లెకు న్యాయం జరిగేలా చేస్తామని అప్పట్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్థానిక వైసీపీ నాయకులకు హామీ ఇచ్చారని తెలిసింది.
మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే వచ్చిన నష్టం ఏమిటని ఆ నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషా వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో సొంత పార్టీ నాయకులు ఆయన మీద మండిపడ్డారు. చివరికి ఎమ్మెల్యే టిక్కెట్ రాకపోవడంతో నవాజ్ బాషా సైలెంట్ గా ఉండిపోయారు. మదనపల్లె నియోజక వర్గం వైసీపీ టిక్కెట్ దక్కించుకున్న నిషార్ అహమ్మద్ సైతం మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని సీఎం జగన్ హామీ ఇస్తారని ఆశపడ్డారు.

అయితే సీఎం జగన్ మాత్రం మదనపల్లె బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై విమర్శలు చేశారు. చంద్రబాబు నియోజక వర్గం కుప్పం గురించి మాట్లాడారు. అయితే మదనపల్లె విషయంలో వైఎస్ జగన్ క్లారిటీ ఇవ్వకపోవడంతో స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే బహిరంగ సభలో రాయచోటి ఎమ్మెల్యే, సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు శ్రీకాంత్ రెడ్డి కూడా ఉండటంతో సీఎం వైఎస్ జగన్ మదనపల్లె జిల్లా కేంద్రం విషయం గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదని తెలిసింది.
మేము అధికారంలోకి వస్తే మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజలకు హామీ ఇచ్చి అదే నినాదంతో ఎన్నికల ప్రచారం చేస్తోంది. టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, వైసీపీ అభ్యర్థి నిషార్ అహమ్మద్ ఇద్దరూ మైనారిటీలు కావడంతో ఇద్దరూ ఎవరికి వారు మదనపల్లె ప్రజలకు హామీలు ఇస్తున్నారు. అయితే మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడంతో వ్యాపారాల్లో చాలా దెబ్బ తిన్నామని అంటున్న కొందరు వ్యాపారులు మాత్రం తాము వైసీపీకి పని చెయ్యలేమని అంటున్నారని తెలిసింది.
మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని, లేదంటే వేరే రకంగా ఆ ప్రాంతానికి మేలు జరిగిలేలా చేస్తామని ఇంతకాలం చెప్పిన వైసీపీ నాయకులు చివరికి బహిరంగ సభలో సీఎం జగన్ ఆ విషయం గురించి మాట్లాడకుండా వెళ్లిపోవడంతో ఇప్పుడు అయోమయంలో పడిపోయారు. సీఎం జగన్ మదనపల్లె గురించి ఎక్కువగా మాట్లాడుతారని అనుకున్న స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున బహిరంగ సభకు వెళ్లారు. అయితే మదనపల్లె గురించి సీఎం జగన్ ఎక్కడా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు వైసీపీలోని కొంత మంది నాయకులు ఏం చెయ్యాలో తెలీక అయోమయంలో పడిపోయారని తెలిసింది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications