గతాన్ని మరచిపోయావా జగన్.. ప్రతిపక్ష హోదాకోసం లేఖ సిగ్గుచేటు: కడప ఎమ్మెల్యే కౌంటర్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ కు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని లేఖ రాశారు. విపక్షంలో ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతోందని, కనుక వైసిపి కి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యల పట్ల తమ గళాన్ని సభలో వినిపించే అవకాశం ఉంటుందని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.

ప్రతిపక్ష హోదా కోసం లేఖ రాయటం సిగ్గు చేటు
ఇక జగన్ స్పీకర్ కు రాసిన లేఖపై ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది, తాజాగా కడప ఎమ్మెల్యే ఆర్ మాధవి రెడ్డి జగన్ లేఖను టార్గెట్ చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ శాసనసభాపతికి లేఖ రాయడం సిగ్గుచేటని ఆమె ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆర్ మాధవి రెడ్డి జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

YS Jagan letter for opposition status is shameful Kadapa MLA

ఆ మాటలు మరచిపోయారా జగన్
మొత్తం సభ్యులలో పదవ వంతు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందన్నారు. ఈ విషయంపై కనీస అవగాహన కూడా లేకుండా జగన్ ప్రతిపక్ష హోదా కోరడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. ఆరుగురు ఎమ్మెల్యేలను పీకేస్తే టిడిపికి ప్రతిపక్ష హోదా పోతుందని తాను గతంలో అన్న మాటలను జగన్ మరిచిపోయారా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయితేనే మీరు శాసనసభకు వస్తారా? లేకపోతే రారా అంటూ నిలదీశారు.

అధికారం కావాలనే భ్రాంతి నుంచి బయటకు రా జగన్
అలాంటప్పుడు పులివెందుల ప్రజలు మీకు ఎందుకు ఓటేసి గెలిపించినట్టు చెప్పాలని ప్రశ్నించారు. మీ నియోజకవర్గ సమస్యలు మీకు పట్టవా జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కావాలనే భ్రాంతి నుంచి ఇప్పటికైనా జగన్ బయటకు రావాలని ఆమె హితవు పలికారు. ఎన్నికల్లో జగన్ కు ప్రజలు 11 సీట్లు మాత్రమే ఇచ్చి బుద్ధి చెప్పడంతో ఇప్పుడు ప్రతిపక్ష హోదా పేరుతో కొత్త నాటకాలకు తెరతీసారని మాధవి రెడ్డి విమర్శించారు.

జగన్ కుయుక్తులకు తెరతీశారు
ప్రజల వద్దకు వెళ్లి ముఖం చూపించుకోలేని జగన్ కుయుక్తులకు తెరతీసారన్నారు. స్పీకర్ ఎన్నిక సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు సభకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో నష్టపోని వ్యక్తి లేరని, అందుకే జగన్ ఎన్నికలలో ఓటమి పాలయ్యారని ఎమ్మెల్యే మాధవి రెడ్డి పేర్కొన్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+