ఎన్నికల వేళ ఓటర్లకు సీఎం జగన్ కీలక పిలుపు..!!

ఏపీలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. గెలుపు కోసం ప్రధాన పార్టీలు శ్రమిస్తున్నాయి. వైసీపీ మేనిఫెస్టోలో అంశాలను వివరిస్తూ ముఖ్యమంత్రి జగన్ ప్రచారం కొనసాగిస్తున్నారు. రేపు (మంగళవారం) టీడీపీ కూటమి మేనిపెస్టో విడుదల చేయనున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో ఏ హామీలు ఉంటాయనే ఆసక్తి కనిపిస్తోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ దూకుడు పెంచారు. చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికల వేళ ప్రజలకు కీలక పిలుపు ఇచ్చారు.

జగన్ ప్రచారం
ముఖ్యమంత్రి జగన్ రోజుకు మూడు ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. తన 58 నెలల పాలనలో అందించిన సంక్షేమం..అమలు చేసిన పథకాలను వివరిస్తున్నారు. చంద్రబాబు పాలనలో చెప్పుకొనే ఏ ఒక్క మంచి అయినా జరిగిందా అని ప్రశ్నిస్తున్నారు. జగన్‌కు ఓటు వేస్తే అన్ని పథకాలు కొనసాగుతాయని.. చంద్రబాబుకు ఓటు వేస్తే.. అన్ని పథకాలు ఆగిపోతాయన్నారు. గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసిందన్నారు. మీ భవిష్యత్ ను నిర్ణయించే ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు దొంగ హామీలతో మోసం చేశారంటూ విమర్శించారు.

YS Jagan made serious allegations against Chandra Babu in his Chowdavaram election campaign

చంద్రబాబును నమ్మితే
చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు గోవిందా.. గోవిందా అంటూ ఎద్దెవా చేశారు. అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది అన్నారు. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకోవాలని సూచించిన జగన్.. కానీ ఓటు వేసే ముందు మాత్రం మంచి చేసే వారికే వేయాలని కోరారు. చంద్రబాబు కేంద్రంతో రాజీ పడి ప్రత్యేక హోదా రాకుండా చేసారని ఆరోపించారు. ఓటు కు నోటు కేసులో అడ్డంగా చంద్రబాబు దొరికిపోయారని విమర్శించారు. రాజధాని పేరుతో గ్రాఫిక్స్ తో మాయ చేసారన్నారు. రాజధాని ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. 58 నెలల కాలంలో ఇంత సంక్షేమం అమలు చేస్తే.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకు చేయలేదని జగన్ నిలదీసారు.

YS Jagan made serious allegations against Chandra Babu in his Chowdavaram election campaign

పథకాలు కొనసాగాలంటే
చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఒక్క స్కీమ్ ప్రజల్లో లేవన్నారు. దోచుకున్న డబ్బులు తో ఓటుకు 2 వేలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధం అయ్యారని ఆరోపించారు. ఓటుకు రూ.3 వేల నుంచి రూ. 5 వేలు ఇవ్వడానికి కూడా సిద్ధం అయ్యారని విమర్శించారు. అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా , పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం స్కూళ్లు కొనసాగాలంటే ఫ్యాన్ కు ఓటు వేయాలని అభ్యర్దించారు. చంద్రబాబు 2014లో చెప్పిన ఏ ఒక్క హమీ అమలు చేయలేదన్నారు. రైతులను, మహిళలను మోసం చేసారన్నారు. ఇప్పుడు మరిన్ని మోస పూరిత హామీలతో చంద్రబాబు వస్తున్నారని చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+