Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సాయిరెడ్డి అయినా అంతే, లెక్క ఇదీ : చంద్రబాబు సిద్దమా - జగన్..!!

మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పై ధ్వజమెత్తారు. తొమ్మిది నెలల పాలనలో 80,820 కోట్లు అప్పులు చేసిందని చెప్పారు. అమరావతి పేరుతో మరో 50 వేల కోట్ల అప్పులు చేస్తుందన్నారు. సాయిరెడ్డి రాజీనామా పై జగన్ తొలి సారి స్పందించారు. అసెంబ్లీకి హాజరు.. జిల్లాల పర్యటనల పైన క్లారిటీ ఇచ్చారు. డిప్యూటీ మేయర్ల పదవి కోసం రాజకీయంగా అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ఎత్తు తగ్గింపు పై నిలదీసారు. తన పైన అనర్హత వేటు వేస్తే తాను సిద్దంగా ఉన్నానని.. చంద్రబాబు సిద్దమా అని సవాల్ చేసారు.

సాయిరెడ్డి అయినా తప్పదు
మాజీ ముఖ్యమంత్రి జగన్ కూటమి ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేసారు. నీతి అయోగ్ రిపోర్టు పైన చంద్రబాబు చెప్పిన లెక్కలకు కౌంటర్ ఇచ్చారు. తన హాయంలో జీఎస్డీపీ లెక్కలను బయట పెట్టారు. తన హయాంలో అప్పుల గురించి ఇదే విధంగా ప్రచారం చేసారని మండిపడ్డారు. హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇచ్చే అంశం పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. జిల్లాల పర్యటనలు త్వరలోనే ప్రారంభం అవుతాయని జగన్ వెల్లడించారు. పార్టీ వీడిన సాయిరెడ్డితో సహా ఇతర నేతల గురించి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. బెదిరించారో, భయపెట్టారనో, ఒత్తిడి ఉందనో పార్టీ మారితే వ్యక్తిత్వం, గౌరవం కోల్పోయినట్లేనని వ్యాఖ్యానించారు. సాయిరెడ్డితో సహా ఎవరికైనా ఇదే వర్తిస్తుందని చెప్పారు.

YS Jagan made serious allegations against Chandra Babu reacts over Vijaya Sai Reddy Resignation

అవినీతి పెరిగిపోయింది
ఎన్నికలు త్వరగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని జగన్ చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో చంద్రబాబును నిలదీసే రోజులు వస్తాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన అప్పుల లెక్క లను జగన్ వివరించారు. ఈ అప్పులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయని ప్రశ్నించారు. సంపద సృష్టించటం ఎలాగో చెప్పాలని చంద్రబాబు అడుగుతున్నారని ఎద్దేవా చేసారు. వాలంటీర్లను, ఉద్యోగులను మోసం చేసారని ఆరోపించారు. బడ్జెట్ లో పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే మౌనంగా ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసారు. దావోస్ లో పెట్టుబడులు రాలేదని.. పెట్టుబడి దారుల ను వేధిస్తున్నారని జందాల్ వ్యవహారాన్ని జగన్ ప్రస్తావించారు. మెడికల్ కళాశాలలను ప్రయివేటుకు అప్పగించాలని ఈ ప్రభుత్వం సిద్ధమయిందని ఆరోపించారు. పే

సిద్దంగానే ఉన్నాను
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గుతుంటే.. చంద్రబాబు జేబులో ఆదాయం పెరుగుతుందని జగన్ ఆరోపించారు. మద్యం, ఇసుక, ఫ్లై యాష్ మాఫియాలు పెదబాబు, చినబాబు, దత్తపుత్రుడుకు వాటాలు ఇస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలే పేకాట క్లబ్ లు నడుపుతున్నారని జగన్ ఆరోపించారు. నియోజకవర్గంలో ఏం జరగాలన్నా ఎమ్మెల్యేల అనుమతి తీసుకోవాల్సిందేనని జగన్ వ్యాఖ్యానించారు. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధమని ప్రశ్నించారు. ఎవరో ఒకర్ని ఇరికించి.. కేసులు పెడుతున్నారన్నారు. మద్యం బేసిక్ ధరలు తగ్గించి.. సరఫరా తగ్గించిన తనకు లంచాలు ఇస్తారా.. రేట్లు , సరఫరా పెంచిన చంద్రబాబుకు మామూళ్లు ఇస్తారా అని జగన్ ప్రశ్నించారు. రాజకీయాల్లో కష్టాలు ఉంటాయని... ఐదేళ్లు కష్టపడితే మనం టైం వస్తుందని చెప్పు కొచ్చారు. అసెంబ్లీకి హాజరు కాకుంటే ఏ చర్యలు తీసుకున్నా తాను సిద్దంగా ఉన్నానని జగన్ తేల్చి చెప్పారు. తాను చేసిన జగన్ 2.0 కామెంట్స్ గురించి మరింత స్పష్టత ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+