జగన్‌కు హెలికాప్టర్ ద్వారా పూలు: తెలుగుతల్లికి మాల
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి హెలికాప్టర్ ద్వారా పూలు చల్లేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. పదహారు నెలల జైలు జీవితం అనంతరం జగన్ మంగళవారం మధ్యాహ్నం జైలు నుండి విడుదలవుతున్నారు.
ఆయనకు సోమవారం సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పూచీకత్తును మంగళవారం సమర్పించారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి జగన్ విడుదలకు సంబంధించిన ఆర్డర్ పత్రాలను చంచల్ గూడ జైలు అధికారులకు పంపిస్తారు.

మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల ప్రాంతంలో జగన్ జైలు నుండి బయటకు వస్తారు. ఈ సమయంలో ఆయన పైన హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించేందుకు ఆ పార్టీ నాయకులు సిద్ధమయ్యారట. అందుకోసం అన్ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.
జగన్ జైలు నుండి బయటకు వచ్చినప్పుడు పూలవర్షం కురిపిస్తారు. ఆయన లోటస్ పాండుకు వెళ్లేటప్పుడు కూడా మార్గంలో పూలవర్షం కురిపించే అవకాశాలున్నాయట. కాగా, జైలు నుండి బయటకు వచ్చిన అనంతరం జగన్ తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేయనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత పంజాగుట్టలోని వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేస్తారు.












Click it and Unblock the Notifications