ఏం చేద్దాం, ఎలా ముందుకెళ్దాం?: ఎంపీలతో జగన్, అలా చేస్తే రాజీనామాలు.. మేకపాటి

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. అవిశ్వాస తీర్మానం, ఎంపీల రాజీనామా అంశంపై చర్చించారు. ఏం చేద్దాం, ఎలా ముందుకు వెళ్దామనే విషయమై చర్చించారు.

YS Jagan meeting with YSRCP MPs to plan next action

భేటీకి ముందు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై పార్లమెంటులో చర్చ జరుగుతుందనే ఆశతో ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ కూడా నోటీసులు ఇచ్చినందున సంఖ్యాబలం బాగుందన్నారు. పార్లమెంటు నిరవదిక వాయిదా పడితే రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్తామన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని చెప్పి టీడీపీ మాట తప్పిందన్నారు.

YS Jagan meeting with YSRCP MPs to plan next action

ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్‌ సత్తెనపల్లి నియోజకవర్గంలో సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై వైసీపీ లోకసభలో ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందా? లేక టీడీపీ ఇచ్చిన అవిశ్వాసం చర్చకు వస్తుందా? పార్లమెంట్‌లో కేంద్రంలోని మంత్రులతో టీడీపీ ఎంపీలు ఎలాంటి చర్చలు జరుపుతున్నారు? తాజాగా కాంగ్రెస్‌ కూడా కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలా? వద్దా? వంటి విషయాలపై చర్చించారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+