మాకేమైనా జరిగితే బాధ్యత చంద్రబాబుదే: అఖిలప్రియ
హైదరాబాద్: తమ కుటుంబానికి ఏదైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. అనుక్షణం ప్రజల కోసమే పని చేస్తున్న తన తండ్రి భూమా నాగిరెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి, రౌడీషీట్ ఓపెన్ చేశారని ఆరోపించారు.
న్యాయవ్యవస్థ మీద తమకు నమ్మకం ఉందని, తన తండ్రి క్లీన్‌చిట్‌తో బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సరైన విచారణ చేయకుండా కేసులు పెట్టిన పోలీసుల మీద కూడా న్యాయపోరాటం చేస్తామని అఖిలప్రియ చెప్పారు.

ప్రతిపక్షాల గొంతునొక్కుతున్నారు: మైసూరా
భూమా నాగిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయమేనని వైయైస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంవి మైసూరా రెడ్డి అన్నారు. కొంతమంది పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతునొక్కేందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.
కర్నూలు ఎస్పీకి కనీస విచక్షణా కూడా లేదా అని మైసూరా ప్రశ్నించారు. ఎమ్మెల్యేపై రౌడీ షీట్ తెరుస్తారా అని నిలదీశారు. ఏ సందర్భంలో రౌడీషీట్ తెరుస్తారో చదువుకున్నారా? లేదా? అని ఆయన మండిపడ్డారు. కొంతమంది పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని మైసూరా రెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications