వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండో రోజు జగన్ పర్యటన, భారీ క్యూలో జనం(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ హుదూద్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటిస్తున్నారు. ఈ రోజు పర్యటనలో భాగంగా జగన్ షిప్పింగ్ హార్బర్, జాలారి పేట, ఆంధ్రా యూనివర్సిటీ, పెద్ద గదిలి, ధర్మవరం, తాడిచెట్లపాలం, దుర్గగుడి, కొబ్బరితొట ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

హుదూద్ తుఫాను బాధితులకు వైయస్ జగన్ పరామర్శించారు. అనంతరం ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని భవనాలకు వాటిల్లిన నష్టాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఆతర్వాత హుదూద్ తుఫానులో నష్టపోయిన మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా వైయస్ జగన్ మాట్లాడుతూ సుమారు 400 మరబోట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని మత్స్యకారులు చెబుతున్నారని, ఆ నష్టపరిహారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఫిషింగ్ హార్బర్‌పై 20వేల కుటుంబాలు బతుకుతున్నాయని, ఇంటిపై కప్పులతో పాటు శ్లాబులు కూడా ఎగిరిపోయాయని వైయస్ జగన్ తెలిపారు.

ఇంతవరకూ ఏ అధికారులు రాలేదని మత్స్యకారులు చెబుతున్నారని, వెంటనే అధికారులు వచ్చి నష్టాన్ని అంచనా వేయాలన్నారు. మత్స్యకారులకు నాలుగు రోజుల్లో ఒక్క పూటే పులిహోర పొట్లాలు అందాయని చెప్పినట్లు జగన్ అన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వైయస్ జగన్ మంగళవారం విశాఖపట్నం చేరుకున్న విషయం తెలిసిందే.

మంగళవారం నక్కపల్లి మండలంలోని కాగిత గ్రామంలో ధ్వంసమైన జీడి మామిడి తోటనలు పరిశీలించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాను బాధితులకు తమ పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. బాధితులకు వీలైనంత ఎక్కువ పరిహారం అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందించేవరకు తమ పార్టీ బాధితులకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. తుఫాను తాకిడికి గురైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో జగన్ పర్యటిస్తారు. సహాయక చర్యలు పూర్తయ్యే వరకు ఆయన ఈ నాలుగు జిల్లాల్లోనే ఉంటారు. రైతుల తరఫున పోరాడుతామని ఆయ చెప్పారు.

హుదూద్ తుఫాన్ వైజాగ్ వాసులకు అనేక కష్టాలను తెచ్చిపెట్టింది. పాలు, మంచినీళ్లు, హోటళ్లలో టిఫిన్, ఏటీఎం సెంటర్లు, పెట్రోల్ బంకులు ఇలా ప్రతి చోట భారీ క్యూలో గంటల కొద్ద వేచి చూడాల్సి వచ్చింది. సోమవారం మద్యాహ్వాం తర్వాత బయటకు వచ్చిన నగర వాసులు కార్పోరేషన్ నీటి ట్యాంకర్ల వద్ద క్యూ కట్టారు. పాల ప్యాకెట్లు రూ. 40 నుంచి రూ. 50కి అమ్ముతున్న వాటిని కొనేందుకు జనం బారులు తీరారు.

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించనున్న జగన్

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించనున్న జగన్

మంగళవారం నక్కపల్లి మండలంలోని కాగిత గ్రామంలో ధ్వంసమైన జీడి మామిడి తోటనలు పరిశీలించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించనున్న జగన్

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించనున్న జగన్

తుఫాను బాధితులకు తమ పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు.

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించనున్న జగన్

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించనున్న జగన్

ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందించేవరకు తమ పార్టీ బాధితులకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించనున్న జగన్

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించనున్న జగన్

తుఫాను తాకిడికి గురైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో జగన్ పర్యటిస్తారు. సహాయక చర్యలు పూర్తయ్యే వరకు ఆయన ఈ నాలుగు జిల్లాల్లోనే ఉంటారు. రైతుల తరఫున పోరాడుతామని ఆయ చెప్పారు.

 తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించనున్న జగన్

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించనున్న జగన్

హుదూద్ తుఫాన్ కారణంగా పాడైపోయిన బోట్లను పరిశీలించిన వైకాపా అధినేత వైయస్ జగన్. సహాయక చర్యలు పూర్తయ్యే వరకు ఆయన ఈ నాలుగు జిల్లాల్లోనే ఉంటారు.

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించనున్న జగన్

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించనున్న జగన్

హుదూద్ తుఫాన్ వైజాగ్ వాసులకు అనేక కష్టాలను తెచ్చిపెట్టింది. పాలు, మంచినీళ్లు, హోటళ్లలో టిఫిన్, ఏటీఎం సెంటర్లు, పెట్రోల్ బంకులు ఇలా ప్రతి చోట భారీ క్యూలో గంటల కొద్ద వేచి చూడాల్సి వచ్చింది.

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించనున్న జగన్

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించనున్న జగన్

సోమవారం మద్యాహ్వాం తర్వాత బయటకు వచ్చిన నగర వాసులు కార్పోరేషన్ నీటి ట్యాంకర్ల వద్ద క్యూ కట్టారు. పాల ప్యాకెట్లు రూ. 40 నుంచి రూ. 50కి అమ్ముతున్న వాటిని కొనేందుకు జనం బారులు తీరారు.

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించనున్న జగన్

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించనున్న జగన్

ఉత్తరాంధ్రపై విరుచుకు పడిన హుదూద్ తుపాన్ ధాటికి ఇప్పటి వరకు 22 మంది మృతి చెందినట్టు అధికారులు గుర్తించారు. విశాఖపట్నం జిల్లాలో 15 మంది, విజయనగరం జిల్లాలో 6 మంది, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు తుపాను బీభత్సానికి బలయ్యారు.

 తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించనున్న జగన్

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించనున్న జగన్

1,833 పశువులు చనిపోయాయి. 181 పడవలు ధ్వంసమయ్యాయి. ఈ వివరాలను ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

English summary
YSRCP chief and the leader of opposition YS Jagan Mohan Reddy has visited the cyclone hit areas on Tuesday. He has visited Rajahmundry first by air and then rushed towards Visakha by road to console the cyclone-hit people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X