ఈడీ మరో షాక్: జగన్ ఆస్తుల కేసులో రూ.117 కోట్ల ఆస్తుల అటాచ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులో ఈడీ మరోసారి ఆస్తులు అటాచ్ చేసింది. రూ.117.74 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఇది జగన్‌కు మరో షాక్ అని చెప్పవచ్చు.

గృహ నిర్మాణ ప్రాజెక్టుల ఛార్జీషీటులో ఈ ఆస్తులను అటాచ్ చేసింది. ఎంబసీ ప్రాపర్టీ డెవలప్‌మెంట్, శ్యాంప్రసాద్ రెడ్డి, ఇందూ ప్రాజెక్టు, వసంత ప్రాజెక్టుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

YS Jagan money laundering case: ED attaches Rs.117 crore assets

వైయస్ జగన్ ఆస్తుల కేసులో అంతకుముందు పలుమార్లు ఈడీ, సీబీఐ అటాచ్ చేసింది. అంతకుముందు రూ.749 కోట్ల ఆస్తులు, ఆ తర్వాత రూ.148 కోట్ల ఆస్తులు ఇలా అటాచ్ చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Enforcement Directorate attaches Rs.117 crore assets in connection with money laundering probe cases against YSR Congress leader Jagan Mohan Reddy, others.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి