వైఎస్ జగన్ నిజమైన క్రైస్తవుడు కారు: సెబాస్టియన్ సంచలన వ్యాఖ్య
రాజమహేంద్రవరం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిజమైన క్రైస్తవుడు కాదని తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ హ్యారీ సెబాస్టియన్ ఆరోపించారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

పుష్కరాల్లో పిండ ప్రదానాలు చేయడం, పూజలు నిర్వహించడం వంటి పనులు చేసిన వారెవరూ క్రైస్తవులు కాదని, వారు వాటికి దూరంగా ఉంటారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవ సంఘాలు జగన్ వెంటే ఉన్నాయనడం పూర్తిగా అవాస్తవమన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం తమ సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ క్రైస్తవుల సంక్షేమానికి పాటుపడుతున్నారని, అందులో భాగంగానే అమరావతిలో క్రైస్తవ భవనం నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications