రాజీ పడితే జగన్‌కు ఇన్ని కష్టాలు వచ్చేవా, ముక్కుసూటి మనిషి: అంబటి
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ చర్చలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యులు చేశారు. జగన్మోహన్ రెడ్డి స్వభావంపై అంబటి వ్యాఖ్యానించారు.
సిబిఐ కేసుల కారణంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు రాజీలకు వచ్చారనే విషయంపై వేడిగా వాడిగా చర్చ సాగుతోంది. అంతకుముందు పరస్పరం శత్రువుల్లా మెలిగిన కెసిఆర్, చంద్రబాబు కూడా ఈ కేసులకు భయపడే ఇద్దరూ ఓ అవగాహనకు వచ్చారని ప్రతిపక్షాల నాయకులు అభిప్రాయపడ్డారు.

వైఎస్ జగన్ కూడా సీబీఐ కేసుల కారణంగా కేంద్రంతో రాజీకి వస్తున్నారని ఓ వక్త చేసిన వ్యాఖ్యలపై అంబటి అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ ముక్కసూటి మనిష అని, ఇలాంటి రాజీలకు వచ్చే అవకాశమే లేదని అన్నారు. అయినా అసలు జగన్‌కు అలాంటి రాజీ స్వభావమే ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా ఎందుకు వస్తుందని ఆయన అన్నారు
జగన్‌కు రాజీ స్వభావం ఉంటే అసలు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతోనే రాజీ చేసుకునేవారన్నారు. అలా చేసుకుని ఉంటే.. ఇప్పుడు తమకు ఈ కష్టాలు ఉండేవి కాదు కూడా అన్నారు.












Click it and Unblock the Notifications