లెజెండరీ సింగర్ ఎస్‌ జానకి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

లెజెండరీ సింగర్ ఎస్. జానకి కన్ను మూసిన విషయం తెలిసిందే. కర్ణాటక మైసురులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూలై 11 శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. వృద్ధాప్య కారణాలతో తుది శ్వాస విడిచినట్లు జానకి మనవరాలు ఇన్​ స్టా గ్రామ్ వేదికగా ప్రకటించారు. ఇక గాన కోకిల గా ప్రసిద్ధి చెందిన ఎస్. జానకి తన కెరీర్ లో దాదాపు 50 వేలకు పైగా పాటలు పాడారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఆమె పాటలు పాడారు. అలాగే 4 జాతీయ అవార్డులు స్వీకరించారు. 5 నంది అవార్డులు పొందారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె ఘనతలు ఎన్నో..

ఇక ఎస్. జానకి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకమ్మ మరణవార్త తన హృదయాన్ని కలచివేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తన సినీ కెరీర్ లో ఎన్నో మరచిపోలేని సాంగ్స్ కు తన గొంతుతో ప్రాణం పోశారని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ.. ఎస్. జానకి మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమ కుటుంబంతో ఆమెకు దశాబ్దాల అనుభవం ఉందని గుర్తు చేసుకున్నారు.

ఎస్. జానకి దాదాపు 17 భాషల్లో 50 వేలకుపైగా పాటలను ఆలపించారు. సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో ఘనతలు సాధించారు. మరి ఇన్నేళ్ల కెరీర్ లో ఆమె ఎన్ని ఆస్తులు సంపాదించారు..? ఆమె ఆస్తుల విలువ ఎంత..? అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇక సినీ సంగీత చరిత్రలోనే చిర స్థాయిగా నిలిచిపోయే స్థానం సంపాదించిన ఎస్. జానకి ఆస్తులు కూడా బాగానే కూడబెట్టినట్లు సమాచారం. అత్యధిక పారితోషికం తీసుకునే గాయనిగా ఆమె రాణించినట్లు తెలుస్తోంది.

SJanaki legendary singer has passed away What is the value of S Janaki assets know the fulldetails

అప్పట్లోనే ఎస్. జానకి లక్షల్లో పారితోషికం తీసుకున్నారట. గత పదేళ్ల నుంచి ఆమె పాటలకు దూరమయ్యారు. అయితే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ వార్తా కథనాల ప్రకారం.. ఎస్. జానకి ఆస్తుల విలువ రూ.537 కోట్లు ఉంటుందని అంచనా. ఆమె ఆస్తులు ఎక్కువగా చెన్నైలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్. జానకి తన ఆస్తులను ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలోనే పెట్టినట్లు స్పష్టం అవుతోంది. ఇక ఎస్. జానకి అంత్యక్రియలు ఇవాళ సాయంత్రానికి పూర్తి కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+