జగన్ కీలక ఆదేశాలు- ఇకపై కాలేజీలు, వర్శిటీల్లో ఏఐ, ఏఆర్, వీఆర్ కోర్సులు

విద్యాశాఖ అధికారులు, విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్స్‌లర్లతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ ఇవాళ కీలక సమావేశం నిర్వహించారు. విద్యారంగంలో కీలక మార్పులపై సమాలోచనలు జరిపారు. బోధన, నైపుణ్యాభివృద్ధిలో ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ అనుసంధానంపై సీఎం కీలక దృష్టి పెట్టారు. ఏఐ, వర్చువల్‌ రియాల్టీ, అగ్‌మెంటేషన్‌ రియాల్టీలను బోధనలో వాడుకోవడంపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ రంగాల్లో క్రియేటర్లుగా విద్యార్ధులను తయారుచేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

వీసీలు, విద్యాశాఖాధికారులతో సమీక్షలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం ఒక స్థాయిలో ఉంటే... లక్ష్యం ఇంకో స్థాయిలో ఉందన్నారు. ఈ గ్యాప్‌ను పూడ్చాలంటే ఏం చేయాలన్నదానిపై ఆలోచనలను పంచుకోవడానికి అందర్నీ ఒక చోటకు పిలిచాననన్నారు. ఉన్నత విద్యా రంగంలో వీసీలది కీలక పాత్రని, అందుకే వారిని కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నామన్నారు. గతంలో టెక్నాలజీలో మూడు విప్లవాలు చూశామని, ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రూపంలో నాలుగో విప్లవం దిశగా అడుగులు వేస్తున్నట్లు సీఎం తెలిపారు.

implementaivrandarcoursesininstitutions2

రాబోయే రోజుల్లో విద్యావిధానాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పూర్తిగా మార్చబోతోందని సీఎం జగన్ తెలిపారు. ఈ అడుగులో వెనుకబడితే కేవలం అనుసరించే వాళ్లగానే మిగులుతామన్నారు. సరైన సమయంలో తగిన విధంగా అడుగులు వేయగలిగితే... ఈరంగాల్లో నాయకులం అవుతామన్నారు. ఏఐ అభివృద్ధి చెందుతున్న కొద్దీ దీన్ని వినియోగించుకుని, సామర్ధ్యాన్ని పెంచుకునే వర్గం ఒకరు అయితే, ఏఐని క్రియేట్‌ చేసేవారు మరొక వర్గంగా తయారవుతారన్నారు. ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో క్రియేటర్లుగా మారడం అన్నది చాలా ముఖ్యమన్నారు.

ఓవైపు ఏఐని విద్యావిధానంలోకి తీసుకువచ్చి విద్యార్థులకు బోధన, నేర్చుకునే సమర్థతను పెంచుకోవడంలో ఎలా వాడుకోవాలి? అన్న కార్యక్రమం చేస్తూనే.. రెండోవైపున ఏఐ క్రియట్‌ చేసే స్కిల్స్, టాలెంట్‌ను కూడా పిల్లల్లోకి తీసుకుని రావాలని జగన్ సూచించారు. ఇది కూడా కరిక్యులమ్‌లో భాగం కావాలన్నారు. పాశ్చాత్య ప్రపంచం అంతా డెమొగ్రఫిక్‌ ఇన్‌బ్యాలెన్స్‌ ఎదుర్కొంటోందని, మనదేశంలో కాని, మన రాష్ట్రంలోకాని సుమారు 70శాతం మంది పనిచేసే వయస్సులో ఉన్నారన్నారు. వీరికి సరైన నాలెడ్జ్, స్కిల్స్‌ ఇవ్వలేకపోతే మనం ప్రపంచానికి మార్గనిర్దేశకులుగా ఉండలేమన్నారు.

implementaivrandarcoursesininstitutions2

ఒకసారి వెస్ట్రన్‌ కరిక్యులమ్‌ చూస్తే వెస్ట్రన్‌ వరల్డ్‌లో ఒక ఫ్యాకల్టీని తీసుకుంటే చాలా వర్టికల్స్‌ కనిపిస్తాయని జగన్ తెలిపారు.ఒక బీకాంలోనే అసెట్‌ మేనేజ్‌మెంట్, ఫైనాన్సియల్‌ మార్కెట్, రిస్క్‌ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ అనాలసిస్‌ ఇలాంటి వర్టికల్స్‌ ఎన్నో ఉన్నాయని, మన దగ్గర అవి లేవన్నారు. మంచి డిగ్రీ రావాలంటే విదేశాలకు పోవాల్సిందేనన్నారు. మనం కూడా చదువుకునే విద్యార్థులకు మరిన్ని ఆప్షన్లు ఇవ్వాలన్నారు. ఆ రకంగా చేయడానికి ప్రతి ఫ్యాకల్టీలో మనం క్రియేట్‌ చేయగలగాలి. దీనిపై ప్రతి వీసీ కూడా ఆలోచన చేయాలన్నారు

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను పూర్తిగా వినియోగించుకోవాలి. సెక్యూరిటీ అనాలసిస్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వంటి వర్టికల్‌ కోర్సులకు సంబంధించి బోధన చేసే స్థాయిలో మనం ఉన్నామా? లేదా? అన్నది చూడాలని జగన్ ఆదేశించారు. ఒకవేళ లేకపోతే అలాంటి కోర్సులు కావాలనుకునే విద్యార్థులకు బోధనను నిలిపేస్తామా అని ప్రశ్నించారు. వర్చువల్‌ రియాలిటీని తీసుకునివచ్చి ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీతో కలుపుతామన్నారు. ఎప్పుడైతే ఈ రెండూ కలిసాయో వర్చువల్‌ క్లాస్‌ టీచర్‌ విద్యార్ధులకు పాఠాలు చెబుతారనిి, ఆ మేరకు తరగతుల నిర్వహణ ఉండాలన్నారు.

implementaivrandarcoursesininstitutions2

మెడికల్‌ కోర్సుల బోధనలో కూడా మార్పులు గణనీయంగా రావాల్సి ఉందని జగన్ తెలిపారు. 5 ఏళ్ల మెడికల్‌ కోర్సు రాబోయే రోజుల్లో ఇవాళ సాంకేతిక పరిజ్ఞానానికి తగినట్టుగా కూడా మార్పులు రావాలన్నారు. శరీరాన్ని కోసి ఆపరేషన్‌ చేసే రోజులు పోయాయని, కేవలం కొన్ని రంధ్రాలు చేసి కంప్యూటర్ల ద్వారా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వాడుకుని ఆపరేషన్‌ చేసే స్థాయి వచ్చిందని, అందుకే వైద్యులకు రోబోటిక్స్, ఏఐలను పాఠ్యప్రణాళికలో, బోధనలో భాగస్వామ్యం చేయాలన్నారు.

వీఆర్, ఏఆర్, ఏఐలని టెక్నాలజీని వాడుకుని పిల్లలకు మంచి బోధన, నేర్చుకునే సమర్థతను పెంచాలని జగన్ ఆదేశించారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ క్రియేటర్లుగా కూడా తొలిఅడుగులు పడాలన్నారు. అందుకే పాఠశాల విద్య స్థాయిలో ఒక బోర్డును, హయ్యర్‌ఎడ్యుకేషన్‌ లెవల్లో మరొక బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ఈ రెండింటిని ఇంటిగ్రేట్‌ చేయాలన్నారు. పౌండేషన్‌ లెవల్‌ నుంచి హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వరకు తీసుకుంటున్న చర్యలను సినర్జీ చేయాలన్నారు. దీనిపై మరిన్ని ఆలోచనలు చేయడానికి నాలుగైదు యూనివర్సిటీలతో వర్కింగ్‌ గ్రూపులను ఏర్పాటు చేయాలన్నారు. మెడికల్, ఇంజనీరింగ్‌తో పాటు ఇతర ఫ్యాకల్టీలు కూడా గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని బెస్ట్ సిలబస్, టీచింగ్ మెథడ్స్ ఖరారు చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+