జగన్ మరో సంచలన నిర్ణయం - ఇక నుంచి..!!
ఏపీ రాజకీయాల్లో అనూహ్య ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలి రోజు సమావేశాలకు హజరైన వైసీపీ గవర్నర్ ప్రసంగం సమయంలోనే వాకౌట్ చేసి వెళ్లిపోయింది. పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ భేటీలో కీలక వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీకి హాజరు పైన నిర్ణయం వెల్ల డించారు. అదే విధంగా 2029 లో జరగాల్సిన ఎన్నికల పైన జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
జగన్ కీలక నిర్ణయం
పార్టీ నేతల సమావేశంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపి కి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వం కి లేదని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని సమావేశం లో నిర్ణయం తీసుకున్నారు. బయట వుండే ప్రజా సమస్యలపై పోరాడుదామని జగన్ చెప్పుకొ చ్చారు. ఇక, జమిలి ఎన్నికల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. జాతీయ స్థాయిలో సమీకరణాలు మారుతున్నాయని.. 2028 ఫిబ్రవరిలోనే జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నా రని జగన్ పేర్కొన్నారు. ఇందు కోసం ఇప్పటికే సమాయత్తం కావాలని సూచించారు.

ప్రభుత్వం పై వ్యతిరేకత
క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని జగన్ వ్యాఖ్యానించారు. మనం యుద్ధ రంగంలో ఉన్నాం, విజయం దిశగా అడుగులు వేయాలని సూచించారు. ప్రజా సమస్యల విషయం లో రాజీలేని పోరాటం చేయాలన్నారు. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయా లని పేర్కొన్నారు. ప్రజలకు తోడుగా, ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్టేనని వ్యాఖ్యానించారు. దీని కారణంగానే ప్రజాసమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దని చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. తాను ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రతిపక్షంలో మన సమర్థతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశంగా పేర్కొన్నారు.
ప్రజలతోనే నిలుద్దాం
పార్టీకోసం, ప్రజలకోసం గట్టిగా పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. జమిలి ఎన్నికలు వస్తాయని చెబుతన్నారని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టే ఎన్నో క్లిష్టపరిస్థితులను అధిగమించామని చెప్పారు. అసెంబ్లీలో మనం తప్ప వేరే ప్రతిపక్షం లేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లామన్నారు. ప్రతిపక్షహోదా ఇస్తే.. హక్కుగా మనకు స మయం ఇవ్వాల్సి వస్తుందని వివరించారు. అందుకనే ప్రతిపక్ష హోదాను ఇచ్చేందుకు ముందు కు రావడంలేదని వ్యాఖ్యానించారు. తాను ఏ అంశం మాట్లాడినా ప్రతి అంశాన్నీ ఆధారాలు, రుజు వులతో మాట్లాడతానని స్పష్టం చేసారు. కౌన్సిల్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications